Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లోదుస్తుల్లో రెచ్చిపోవాలా?

By:  Tupaki Desk   |   9 Feb 2018 5:47 PM GMT
ఫోటో స్టోరి: లోదుస్తుల్లో రెచ్చిపోవాలా?
X
గాలి - నీటి మహిమల వల్ల కొందరిలో మార్పులు వస్తాయి అని పెద్దవారు అనడంలో ఒక్కోసారి నిజముందని అనిపిస్తోంది. అందుకు బెస్ట్ ఉదాహరణలను కొంత మంది హీరోయిన్స్ చాలా క్లియర్ గా చూపించేస్తున్నారు. ఆ ఉదాహరణలో బెస్ట్ ఉదాహరణ మన రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడిది నార్త్ బ్లడ్ అయినప్పటికీ సౌత్ లో ఉన్నన్ని రోజులు ట్రెడిషనల్ డ్రెస్సులో ఎక్కువగా కనిపించేది. గ్లామర్ డ్రెస్సుల్లో కూడా కనిపించేది కానీ ఓ లిమిట్ లో ఉండేది.

కానీ ఎప్పుడైతే బాలీవుడ్ కి బండిని యూ టర్న్ తీసుకుందో అమ్మడికి అక్కడి గాలి బాగా తగిలేసింది. బాలీవుడ్ లో ఇన్నోసెంట్ హీరోయిన్లే బికినిలో కనిపిస్తున్నారు. నేను ఆ లుక్ ని టచ్ చేస్తే తప్పేముందు అనుకున్నట్లు ఉంది. వెంటనే బడా మ్యాగజైన్ కవర్ పేజ్ అండతో అడ్డు అదుపు లేకుండా బికినీ లుక్ ని దాదాపు టచ్ చేసింది. నిన్నటి వరకు మ్యాక్సీమ్ కవర్ పేజ్ పై ఓ యాంగిల్స్ లో కనిపించిన రకుల్ ఈ రోజు అందాలను నిలబెట్టి కుర్రకారును నిల్చున్న చోటే పడిపోయేలా చేసింది.

ఆమె నటించిన బాలీవుడ్ సినిమా అయ్యారి మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో అమ్మడు తన హాట్ స్టిల్స్ తో రచ్చ చేస్తుండడంతో ఆ సినిమాలో కనిపించబోతోన్న బామ ఈ పిల్లేనా అని చర్చించుకుంటున్నారు. సినిమా పై అంచనాలు పెద్దగా లేకపోయిన్నప్పటికి రకుల్ ప్రయత్నాలు చూస్తుంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా అక్కడ ఛాన్సులు కొట్టేయలని చూస్తోంది అన్నట్లు ఉంది. అయినా ఎంత బాలీవుడ్ వెళితే మాత్రం ఇలా లోదుస్తుల్లో బికినీల్లో రెచ్చిపోవాలా? అని సోషల్ మీడియాలో రకుల్ కి కొన్ని కౌంటర్లు తప్పడం లేదు.