Begin typing your search above and press return to search.

ఫిదా పిల్లే కానీ.. కొంచెం తేడా

By:  Tupaki Desk   |   8 Dec 2017 12:34 PM GMT
ఫిదా పిల్లే కానీ.. కొంచెం తేడా
X
టాలీవుడ్ లో అందంగా ఉన్న హీరోయిన్స్ కంటే.. వారి నటనతో వెరైటీగా కనిపించే హీరోయిన్స్ అంటేనే మన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అందం అభినయం చురుకుదనం కలబోసిన మాస్ హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు. ఆ తరహాలో ప్రస్తుతం కనిపిస్తున్న ఒకే ఒక్క ముద్దుగుమ్మ సాయి పల్లవి. అమ్మడిది తమిళం అయినా ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా మొదటి సినిమాకే తెలుగు నేర్చేసుకుంది. అంతే కాకుండా నాటు తెలంగాణ భాషకు కూడా చాలా అలవాటు పడిపోయింది.

ఫిదా సినిమాలో సాయి పల్లవి నటన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ పిల్లలాగా మాట్లాడి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఒక్క సినిమాకే స్టార్ డమ్ ని తెచ్చుకొని చాలా ఆఫర్స్ ని తన వరకు తెచ్చుకుంది. కాని కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటోంది. ఇకపోతే నెక్స్ట్ అమ్మడు MCA తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కూడా సాయి పల్లవి తెలంగాణకు చెందిన అమ్మాయేనట. కాకపోతే బాషా మాత్రం నార్మల్ గానే ఉంటుందట. ఎందుకో తెలుసా?

ఎందుకంటే ఆల్రెడీ ఫిదాలో చేసిన క్యారెక్టర్ మళ్లీ రిపీట్ అయినట్టు ఉంటుందని సింపుల్ భాషని సెట్ చేశారట నిర్మాత దిల్ రాజు. ఇక నాని కూడా వరంగల్ లోకల్ అబ్బాయిగా కనిపించబోతున్నట్లు తెకూస్తోంది. వారి ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక మాజీ హీరోయిన్ భూమిక ఇందులో నానికి వదినగా కనిపించబోతోంది. వారి మధ్య కూడా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటాయట. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.