Begin typing your search above and press return to search.
మొత్తానికి శ్వేతారెడ్డి సాధించింది
By: Tupaki Desk | 8 Aug 2019 4:45 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా తన వద్దకు స్టార్ మాటీవీ వారు మరియు బిగ్ బాస్ షో నిర్వాహకులు వచ్చారని వారు పలు మార్లు నన్ను కలిసి చర్చించారని చివరకు నాకు ఛాన్స్ ఇవ్వలేదని.. తనతో చర్చల సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కాస్టింగ్ కౌచ్ కు తెరలేపే ప్రయత్నం చేశారు అంటూ యాంకర్ శ్వేతారెడ్డి సీజన్ ప్రారంభంకు ముందు నుండే ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఈ విషయమై గాయత్రి గుప్తతో కలిసి ఈమె ఏకంగా జాతీయ మహిళ కమీషన్ ముందుకు వెళ్లడం కూడా జరిగింది. షో ప్రారంభం అయ్యింది.. కారణాలు ఏంటో కాని గత రెండు సీజన్ ల కంటే ఈసారి అధికంగా టీఆర్పీ వచ్చింది. ప్రస్తుతం మూడవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతోంది.
బిగ్ బాస్ ప్రారంభం అయిన తర్వాత శేతారెడ్డి కేసు.. ఆమె ఆరోపణల గురించి అంతా మర్చి పోయారు. ఆమె చేసిన హడావుడి పబ్లిసిటీ కోసమే అంటూ కొందరు.. ఆమెకు ఛాన్స్ రాని కారణంగా ఆరోపణలు చేస్తుందనే వారు కూడా లేకపోలేదు. షో ప్రారంభం అవ్వగానే సైలెంట్ అయ్యిందని అంతా అన్నారు. అయితే తాజాగా మరోసారి ఆమె మీడియా ముందుకు వచ్చింది. తాము మహిళ కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం వచ్చింది అంటూ జాతీయ మహిళ కమీషన్ నుండి వచ్చిన లేఖను చూపించింది.
ఆ లేఖలో తెలంగాణ సీపీ అంజనీకుమార్ కు శ్వేతారెడ్డి మరియు గాయత్రి గుప్తలు పెట్టిన కేసుపై ఎలాంటి ఎంక్వౌరీ జరుగుతుంది. అది ఎంత వరకు వచ్చింది అంటూ ప్రశ్నించడం జరిగింది. అంజనీకుమార్ కు లేఖ పంపించినట్లుగా తెలియజేస్తూ శ్వేతారెడ్డికి మహిళ కమీషన్ లేఖను పంపించడం జరిగింది. శ్వేతారెడ్డి పెట్టిన కేసు విచారణలో పురోగతి లేకుంటే సీపీ అంజనీకుమార్ పై మహిళ కమీషన్ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని శ్వేతారెడ్డి పేర్కొంది. మాకు ఇక్కడ న్యాయం జరగకపోయినా ఢిల్లీ స్థాయిలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా శ్వేతారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసింది.
నా గురించి మొన్నటి వరకు ఎవరైతే తప్పుగా మాట్లాడారో వారికి ఈ లేఖ తో సమాధానం దొరికినట్లయ్యింది. బిగ్ బాస్ స్టార్ అయ్యింది కనుక ఎవరు ఏం చేయలేరు లే అనుకుంటున్నారేమో. కొన్ని రోజులు హడావుడి చేసి వెళ్లి పోతుందిలే అనుకున్నారేమో. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ముందుంది అసలు కథ అంటూ శ్వేతారెడ్డి హెచ్చరించింది. అమ్మాయిలు ఎవరైనా లైంగిక వేదింపులకు గురైనా.. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధించినా కూడా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇక్కడ స్పందన దక్కకుంటే ఢిల్లీ వెళ్లి మహిళ కమీషన్ కు ఫిర్యాదు చేయండి. అక్కడ వరకు వెళ్లలేని వారు మహిళ కమీషన్ వెబ్ సైట్ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వేదింపులు ఎదురైనా కూడా ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందని ఈ సందర్బంగా శ్వేతారెడ్డి పేర్కొంది.