Begin typing your search above and press return to search.

వెండితెరపై మన డ్యాన్సర్ జీవితం

By:  Tupaki Desk   |   18 Jan 2018 11:30 PM GMT
వెండితెరపై మన డ్యాన్సర్ జీవితం
X
ఈ మధ్య కాలం లో బయోపిక్ ల హవా బాగా నడుస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎవరో ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా రూపు దిద్దుకునే చిత్రాలను మనం ఎక్కువే చూస్తున్నాం. ఇంకా రాబోయే కాలం లో కూడా రానున్న బయోపిక్ ల గురించి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గాను - నందమూరి బాలకృష్ణ తన తండ్రి - గొప్ప నటుడు మరియు ప్రజల కోసం పాటుపడ్డ ఎన్టీఆర్ గాను - ఇక కీర్తి సురేష్ మహానటి సావిత్రి గాను మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇపుడు అదే జాబితా లోకి వస్తున్న మరొకరు.. ప్రముఖ కూచిపూడి నృత్యకారిని యామిని కృష్ణమూర్తి. ఈమె జీవితంపై ఇప్పుడు సినిమా వస్తోంది.

77 ఏళ్ల వయస్సున్న ఈ డ్యాన్సర్.. తన జీవితాన్ని కూచిపూడికే అంకితం చేశారు. అందుకే ఆమె జీవితాన్ని తెరపై చూపించాలని అనుకుంటున్నారట. గతంలో డ్యాన్స్ బేస్డ్ మూవీ 'దివ్యమణి' రూపొందించిన గిరిధర్ గోపాల్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా కేవలం నృత్యం గురించి కాకుండా.. యామిని కృష్ణమూర్తి జీవితం చుట్టూ తిరిగే కధ అని తెలుస్తోంది. నిజానికి ఈమె వల్లనే కూచిపూడి నృత్యాన్ని ఒక జానపద కళ గా కాకుండా సంగీత్ నాటక అకాడమీ వారు ఒక నృత్య రూపంగా గుర్తించారు. ఈ సినిమా ను ఇంగ్లీష్ లో తీసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తాం అంటున్న దర్శకుడు ఇంకా కాస్టింగ్ పనులు పూర్తి కావాల్సిందిగా చూడాలి.

ఆంధ్ర ప్రదేశ్ - చిత్తూర్ జిల్లా లో మదనపల్లి లో పుట్టిన యమిని కృష్ణమూర్తి భరతనాట్యం మరియు కూచిపూడి లో ప్రావీణ్యం పొందింది. పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ - మాతృ బాషా తెలుగు అయినప్పటికీ ఈమె పెరిగింది తమిళనాడు లోని చిదంబరంలో. 1957 మొదలుకుని ఎన్నో ఏళ్ల పాటు కొన్ని వందల నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఈమె పద్మ విభూషన్ - పద్మ బూషన్ -పద్మ శ్రీ బిరుదులు కూడా సొంతం చేసుకుంది. ఇపుడు 71 సంవత్సరాలున్న ఈమె ఢిల్లీ లో ఉంటూ తన అకాడమీ లో చాలా మందికి నృత్యం నేర్పుతూనే ఉండడం విశేషం.