Begin typing your search above and press return to search.
వైఎస్ వర్థంతి నాడు 'యాత్ర' సమర శంఖం!
By: Tupaki Desk | 30 Aug 2018 9:46 AM GMTఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న `యాత్ర` బయోపిక్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. జననేత వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తోన్న `యాత్ర`పై భారీ అంచనాలున్నాయి. దివంగత నేత వైఎస్ జన్మదినం సందర్భంగా జులై 8న విడుదల చేసిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వైఎస్ పాత్ర పోషించిన మమ్ముట్టి లుక్ ఆకట్టుకునేలా ఉంది. అయితే, ఆ తర్వాత యాత్రకు సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా యాత్రకు సంబంధించిన మరో కీలకమైన అప్ డేట్ బయటకు వచ్చింది. జననేత వైఎస్ వర్థంతి సందర్భంగా యాత్ర నుంచి ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటనతో పాటు విడుదల చేసిన మమ్ముట్టి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దర్శకుడు మహి.వి రాఘవ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న యాత్ర షూటింగ్ 90 శాతం వరకూ పూర్తయిన సంగతి తెలిసిందే. మిగతా షూటింగ్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చేనెల 2వ తేదీన వైఎస్ వర్ధంతి సందర్భంగా `యాత్ర` నుంచి ఓ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయబోతోంది. సెప్టెంబరు 2వతేదీ ఉదయం 7 గంటలకు 'సమరశంఖం' అనే లిరికల్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎమోషనల్ గా సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ఎలా ఉండబోతోందని వైఎస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ లిరికల్ వీడియో ప్రకటనతోపాటుగా మమ్ముట్టికి చెందిన ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. జనంతో మమేకమై పాదయాత్ర చేస్తోన్న మమ్ముట్టి ఫొటో వైరల్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.