బంతి పూల జానకీ.. ధన్ రాజ్ కోసం

Sun Jan 17 2016 21:00:01 GMT+0530 (IST)

హిట్ సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ను టైటిల్స్ వాడేసే కల్చర్.. మన టాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడో మూవీకి ఇలాంటి టైటిల్ నే సెట్ చేశారు. జబర్దస్త్ యాక్టర్ ధన్ రాజ్ హీరోగా తెరకెక్కతున్న చిత్రానికి.. బంతిపూల జానకి అనే టైటిల్ డిసైడ్ చేశారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా మూవీలో.. బంతిపూల జానకీ జానకీ సాంగ్ కి మంచి  హిట్ అయింది. ఆడియన్స్ కి టైటిల్ చేరువ చేయడం తేలిక కావడం ఇప్పటికీ ఈ పాట ప్రజల నోళ్లలో నానుతుండడంతో.. క్యాచీగా ఉండేలా ఈ టైటిల్ ని ఫిక్స్ చేసుకుంది యూనిట్. ధన్ రాజ్ సరసన దీక్షాపంత్ మౌనిక హీరోయిన్లుగా నటిస్తుండగా.. షకలక శంకర్ సుడిగాలి సుధీర్ రాకెట్ రాఘవ అదుర్స్ రఘు రచ్చ రవి అప్పారావులు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించనున్నారు. జబర్దస్త్ టాప్ కమెడియన్లతో.. ఫుల్ లెంగ్త్ నవ్వులు పంచుతామంటున్నాడు డైరెక్టర్ నెల్లుట్ల ప్రవీణ్ కుమార్.

ఈ మూవీ టైటిల్ లోగోను ప్రముఖ మళయాణ నటుడు మోహన్ లాల్ ఆవిష్కరించడం విశేషం. ఓ సరికొత్త జోనర్ లో.. బంతి పూల జానకి తెరకెక్కుతోందని అంటున్నాడు హీరో ధన్ రాజ్. ఒకే షెడ్యూల్ లో ఈ సినిమాను పూర్తి చేసేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేయబోతున్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.