Begin typing your search above and press return to search.

కెమిస్ట్రీ సెట్ అయ్యింది కాని..

By:  Tupaki Desk   |   30 Nov 2017 2:30 AM GMT
కెమిస్ట్రీ సెట్ అయ్యింది కాని..
X
టాలీవుడ్ లో ఒక్క సినిమాతో మొదటి అడుగు అలా పెట్టిందో లేదో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. అయితే అమ్మడు నార్మల్ గా ఉండడమే కాదు. కొంచెం రొమాన్స్ చేయడం లో కూడా చాలా గడసరి అని రీసెంట్ గా రిలీజ్ అయిన ఏంసీఏ స్టిల్స్ ని చూస్తుంటే అర్థం అవుతోంది.

నాని హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. మిడిల్ క్లాస్ అబ్బాయి గా నాని టీజర్ తోనే మంచి క్రేజ్ ని క్రియేట్ చేశాడు. సాయి పల్లవి కూడా టీజర్ లో ఒక డైలాగ్ తో ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వనుందని చెప్పకనే చెబుతోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ కి ఇంకా సమయం ఉన్నా సినిమా రిలీజ్ డేట్ తొందరగా వస్తే బావుండు అని సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఫొటోస్ విషయానికి వస్తే.. నాని - సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని అర్ధమవుతోంది. సాయి పల్లవి సిగ్గులో ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. కాని అక్కడే ఓ చిక్కొచ్చింది.

అమ్మడు నాని ముందు రొమాంటిక్ గా సిగ్గు పడుతూ.. ముద్దుగా నవ్వుతోంది. అలాగే నాని పై వాలిపోతుండడం చాలా అందంగా ఉంది. కాని ప్రతీసినిమాలో ఇతర నటీనటులు.. ముఖ్యంగా హీరోయిన్లు కనిపించకుండా నాని తొక్కేస్తే.. ఈసారి సాయి పల్లవి తన ప్రెజన్స్ తో నానీని తొక్కేస్తోంది అంటున్నారు సినిమా లవ్వర్స్. ఆ లెక్కన చూస్తే తొలిసారి నాని సినిమాలో మనం వేరే హీరోను (సాయి పల్లవి) చూస్తామా?