Begin typing your search above and press return to search.
కూటమికి షాక్.. టీఆరెస్‌లోకి బీసీ నేత జంప్
By: Tupaki Desk | 25 Nov 2018 11:26 PM ISTతెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ రాజకీయ మండూకాలు ఆ తక్కెడ నుంచి ఈ తక్కెడకు.. ఈ తక్కెడ నుంచి ఆ తక్కెడకు దూకుతున్నాయి. దీంతో చివరకు ఏ తక్కెడ ఎటు మొగ్గుతుందన్న అంచనాకు ఇంకా ఎవరూ రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మహాకూటమికి షాక్ ఇస్తూ బీసీ నేత క్యామ మల్లేశ్ టీఆరెస్‌లో చేరారు.
ఇబ్రహింపట్నంలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బహిరంగసభ సందర్భంగా కాంగ్రెస్ నేత.. రంగారెడ్డి జిల్లా మాజీ డిసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేశ్ టీఆరెస్‌లో చేరారు. క్యామ మల్లేష్ చేరికతో ఇబ్రహీంపట్నంలో విజయంపై టీఆరెస్ ఆశలు పెరిగాయి. క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ తరుపున తనకు ఇబ్రహింపట్నం సీటు రావొచ్చని ఆశించారు. డిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనకు సీటు గ్యారంటీ అని ఆయన కూడా అనుకున్నారు. కానీ ఆ సీటును కూటమిలో భాగంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన టిడిపి నేతకు కట్టబెట్టారు. సామ రంగారెడ్డిని కూటమి అభ్యర్థిగా ఇబ్రహింపట్నం నుంచి పోటీకి దింపారు. కానీ సామ రంగారెడ్డి ఎల్బీ నగర్ లో పోటీ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించారు. ఎల్బీ నగర్ లో సీరియస్ గా గత కొంతకాలంగా పనిచేసుకుంటూ వచ్చారు. అనూహ్యంగా సామ రంగారెడ్డిని ఇబ్రహింపట్నం బరిలోకి దింపింది టిడిపి. దీంతో తనకు టికెట్ వస్తుందని ఆశపడ్డ క్యామ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్ర్కీనింగ్ కమిటీ సభ్యుడు భక్తచరణ్ దాస్ మూడు కోట్లు డిమాండ్ చేశాడని విమర్శలు గుప్పించారు. మూడు కోట్ల రూపాయల తాలూకు ఫోన్ రికార్డింగ్స్ ఇవే అని కొన్ని ఆడియోలు వెలువరించారు.
అలాగే తాను పార్టీ కోసమే జీవితమంతా పనిచేస్తే తనకు టికెట్ ఇవ్వలేదని, కాంగ్రెస్ లో యాదవ సామాజికవర్గాన్ని అనిచిపారేస్తున్నారని క్యామ మల్లేష్ మండిప్డడారు. తనతోపాటు భిక్షపతి యాదవ్, బొల్లం మల్లయ్య యాదవ్, రాజారాం యాదవ్ లాంటి వాళ్లకు కాంగ్రెస్ లో సీటు ఇవ్వలేదని ఆరోపించారు. ఇది యాదవ నేతలకు అవమానమే అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో్వైపు కేసిఆర్ యాదవులకు పెద్ద పీట వేశారని అభినందించారు. కాంగ్రెస్ కూటమి ఒక్క సీటు యాదవులకు కేటాయిస్తే, టిఆర్ఎస్ లో 6 సీట్లు యాదవులకు ఇచ్చారని కొనియాడారు. ఈ పరిస్థితుల్లో క్యామ మల్లేష్ కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంటనే ఆయనను డిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే షోకాజ్ నోటీసుకు బదులు ఇవ్వకపోతే పార్టీ నుంచి తొలగిస్తామని పిసిసి వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆయన కొద్దిగా మెత్తబడ్డారు. ఉత్తమ్ తో ఫోన్ లో మాట్లాడారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు టీఆరెస్లో చేరిపోయారు.
మరోవైపు సామ రంగారెడ్డి టిడిపి నుంచి బరిలో ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి కూడా బరిలో ఉన్నారు. మల్ రెడ్డి కాంగ్రెస్ తరుపున కాకుండా బిఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే మల్ రెడ్డి రంగారెడ్డి రాహుల్ గాంధీ బొమ్మలు, కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తారని, ఆయనకు ఇబ్రహింపట్నం వరకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని పిసిసి పెద్దలు క్యామ మల్లేష్ కు చెప్పారు. కాంగ్రెస్ లో ఉండాలంటే కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి బదులు రెబెల్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్ చేయాలంటూ క్యామకు ఆదేశించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో క్యామ మల్లేష్ ను మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రామిరెడ్డి రెబెల్ గా పోటీ చేసి ఓడించారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి సామ రంగారెడ్డికి కాకుండా రెబెల్ అభ్యర్థి, తన ప్రత్యర్థి వర్గమైన మల్ రెడ్డికి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పెద్దల వత్తిడి రావడంతో క్యామ జీర్ణించుకోలేకోయారు. దీంతో ఇక కాంగ్రెస్ లో ఉండలేక ఆదివారం ఆయన గులాబీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది.