Begin typing your search above and press return to search.
రామోజీ కొత్త వ్యాపారం మొదలైంది
By: Tupaki Desk | 5 July 2018 4:56 AMతెలుగునాట రామోజీరావు అన్నంతనే ఒక ఆసక్తి వ్యక్తమవుతుంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ ఆయనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవటానికి ఉత్సుకతను ప్రదర్శిస్తారు. తనదైన శైలిలో ఉంటూ.. బయటకు పెద్దగా రాకుండా కథను నడిపించే మీడియా మొఘల్ రామోజీ చాలామందికి అర్థంకాని ఫజిల్ గా ఉండిపోతారు.
ఎంతటివారైనా సరే.. తన దగ్గరకు రావటమే తప్పించి.. తాను వెళ్లటం చాలా తక్కువ. మిగిలిన వారికి భిన్నంగా తక్కువగా బయటకు రావటం.. అంతకు మించి తక్కువగా మాట్లాడటం,, చేతల్లో చేసి చూపించే అలవాటున్న రామోజీ వ్యాపార పరంగా ఎన్నెన్ని సంచలనాలు సృష్టించారో తెలియంది కాదు.
మీడియాతో పాటు పలు ఇతర వ్యాపారాలు చేసే రామోజీ..ఈ రోజు నుంచి మరో కొత్త వ్యాపారాన్ని అధికారికంగా ప్రకటించారు. పాత విషయమే అయినా.. ఇందులో కొత్త ముచ్చట ఏమిటంటే.. రామోజీకి చెందిన ఈ ఎఫ్ఎం (అదేనండి ఈనాడు ఎఫ్ఎం) ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. ప్రముఖ మీడియా సంస్థలన్నీ ఎఫ్ఎం వ్యాపారంలోకి ఎప్పుడో వచ్చినా.. మొదట్నించి ఎఫ్ఎం వ్యాపారం పట్ల మక్కువ ప్రదర్శించని రామోజీ.. తర్వాతి కాలంలో తన తప్పును తెలుసుకున్నారు.
అయితే.. వ్యాపారానికి అవసరమైన అనుమతులు ఇవ్వని నేపథ్యంలో కామ్ గా ఉన్న ఆయన.. ఎఫ్ ఎం ఫ్రీక్వెన్సీ కోసం రామోజీ ఫిలింసిటీలో చేసుకోవాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నారు. ప్రీక్వెన్సీల కోసం బిడ్ లు తెరిచిన వెంటనే వేసి.. తన సొంతం చేసుకున్న ఆయన.. ఈ రోజు (గురువారం) నుంచి ఎఫ్ ఎం రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టైర్ వన్ సిటీ అయిన హైదరాబాద్ లో ఎఫ్ ఎం సేవల్ని అందించని ఈనాడు.. టైర్ టు సిటీలైన తిరుపతి.. విజయవాడ.. రాజమండ్రి.. వరంగల్ పట్టణాల్లో సేవల్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఉదయం 9.45 గంటలకు స్టార్ట్ కానున్న రామోజీ వారి ఈ ఎఫ్ ఎం సేవలు ఎలా ఉంటాయో చూడాలి. లేటుగా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఉంటాయో లేదో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చినప్పటికీ.. రాజమండ్రిగా మాత్రమే పేర్కొన్నారు. లైసెన్స్ రాజమండ్రి పేరుతో ఉండటంతో అలా ప్రకటన ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.