Begin typing your search above and press return to search.
రాహుల్ తో రేవంత్ భేటీ...చివర్లో చిన్న ట్విస్ట్
By: Tupaki Desk | 17 Oct 2017 2:40 PM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్టు మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇది నిజమన్నట్లుగా ఢిల్లీలో రేవంత్ పర్యటన బలం చేకూర్చింది. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు ఢిల్లీలో విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఢిల్లీలోని రాహుల్ నివాసం వద్ద తెలుగు మీడియా హడావుడి కొనసాగింది. అయితే చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాహుల్ తో సమావేశం కావాల్సిన రేవంత్ చివరి నిమిషంలో ఆ సమావేశాన్ని రద్దుచేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీడీపీలో ఉండి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయలేకపోతున్నామనే భావనతోనే రేవంత్ సైకిల్ దిగి - హస్తం గూటికి చేరుకోనున్నారని మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీనికి బలం చేకూర్చేలా రెండు రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయడంతో ఒక్కసారిగా అందరిలో ఉత్కంఠ చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగింది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించనున్నట్టు అంచనాలు వెలువడ్డాయి.
అయితే కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. పార్టీపరమైన వ్యవహారాల్లో భాగంగానే తాను ఢిల్లీకి వచ్చినట్లు వివరించారు.రేవంత్ పార్టీ మారే అవకాశమే లేదని టీడీపీలో కొనసాగుతారని ఆయన వర్గీయులు తేల్చిచెప్పారు.