Begin typing your search above and press return to search.

రెండుగా ముంబై ఇండియన్స్?... తెరపైకి సరికొత్త చర్చ!

ఐపీఎల్ - 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి అంతగా కలిసివస్తున్నట్లు లేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది

By:  Tupaki Desk   |   29 March 2024 3:46 AM GMT
రెండుగా ముంబై ఇండియన్స్?... తెరపైకి సరికొత్త చర్చ!
X

ఐపీఎల్ - 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కి అంతగా కలిసివస్తున్నట్లు లేదు. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజా సీజన్ లో వరుసగా రెండు ఓటములు చవి చూసింది. ఇందులో భాగంగా... మొదటి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో, రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ చేతిలో ఓటమి పాలైంది. అయితే గుజరాత్ తో ఓటమిపై కంటే... సన్ రైజర్స్ తో ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ లో చీలిక వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇందులో ప్రధానంగా రెండో మ్యాచ్ లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్ చేతిలో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారనే చెప్పాలి. సన్ రైజర్స్ బ్యాటర్స్ చరిత్ర సృష్టించే స్కోర్ చేశారు. దీనికి కారణం హార్థిక్ పాండ్యా వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవ్వడమే అని అంటున్నారంట.

ఇందులో ప్రధానంగా... తనదైన వ్యూహాల్లో భాగమో ఏమో కానీ, ముంబై జట్టు స్టార్ ఫేసర్, ఆ టీం కి కీలక బౌలర్ అయిన జస్ ప్రీత్ బూమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడని.. తొలి 10 ఓవర్లలోనూ అతడితో కేవలం ఒక్క ఓవర్ వేయించడం ఏమిటని అంటున్నారంట. ఆ సంఅతులు అలా ఉంటే... కారణం ఏదైనా... ప్రస్తుతం ముంబై ఇండియన్స్ రెండుగా చీలిందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా.. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఫేసర్ బుమ్రా, తిలక్ వర్మ ఒక వైపు ఉండగా... కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లు మరోవైపు ఉన్నారని అంటున్నారు. అయితే... ఫ్రాంచైజీ మద్దతు మాత్రం ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యాకే ఉందని అంటున్నారు.

కాగా... పాండ్యాను ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ గా ప్రకటించిన సమయంలో అతనికి వ్యతిరేకంగా రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పెద్ద క్యాంపెయినే రన్ చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. మైదానంలో కూడా పాండ్యాని ర్యాగింగ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి... ముంబై ఇండియన్స్ లో పాండ్యాకి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఒకటి తయారైందని చెబుతున్నారు.

దీంతో... ఇప్పటికే రెండు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో ప్లేస్ కి పడిపోతే... ఈ పరిస్థితుల్లో ఈగోలు, అసమ్మతి వర్గాలు అంటూ ఈ రచ్చ అవసరమా అని సగటు ఎంఐ టీం అభిమాని వాపోతున్నాడని తెలుస్తుంది.