Begin typing your search above and press return to search.

రాజస్థాన్ వర్సెస్ డీసీ... హెడ్ టు హెడ్ రిపోర్ట్ రికార్డులు ఇవే!

రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 27 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వాటిలో రాజస్థాన్ 14 మ్యాచ్ లలో గెలవగా.. ఢిల్లీ 13 మ్యాచ్ లలో గెలిచింది.

By:  Tupaki Desk   |   27 March 2024 11:30 PM GMT
రాజస్థాన్  వర్సెస్  డీసీ... హెడ్  టు హెడ్  రిపోర్ట్  రికార్డులు ఇవే!
X

జైపూర్‌ లోని సవాయ్ మాన్‌ సింగ్ స్టేడియంలో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్ లో రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. అయితే... మొదటి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిపోయి, ఈసారి ఎలాగైనా బోణీకోట్టాలనే కసిలో ఢిల్లీ ఉంటే... ఇప్పటికే లక్నోపై గ్రాండ్ విక్టరీ సాధించి, విజయం పరంపరని కొనసాగించాలనే ఉత్సాహంతో రాజస్థాన్ ఉంది!

అవును... మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరే చేసింది. ఇందులో ప్రధానంగా ఆర్.ఆర్. కెప్టెన్ సంజూ సాంసన్ 52 బంతుల్లో 82 పరుగులు చేయగా... మిడిల్ ఓవర్స్ లో రియాన్ పరాగ్ 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

ఇదే క్రమంలో... డెత్ ఓవర్స్ లో ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేశారు. అనంతరం 194 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో.. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది.

ఇక, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఈ సీజన్ లోని తొలిమ్యాచ్ లో కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనాన్ని ఢిల్లీ చూసింది. ఈ సందర్భంగా అతడు మైదానంలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. అయితే... సుమారు 15 నెలల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ లోకి వచ్చిన పంత్ 18 పరుగులు (13 బంతుల్లో) మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ బ్యాట్స్‌ మెన్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు, కానీ వారు జట్టుగా ఆడి 174/9 స్కోరు చేశారు.

అయితే ఆ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో డీసీ ఫస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలయ్యింది. ఇలా ఒకరు గెలిచిన ఉత్సాహంలోనూ, మరొకరు ఓడిన కసిలోనూ బరిలోకి దిగబోతున్నారు. దీంతో.. ఈ మ్యాచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది.

హెడ్ టు హెడ్ రికార్డ్‌ లు!:

రాజస్థాన్, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 27 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వాటిలో రాజస్థాన్ 14 మ్యాచ్ లలో గెలవగా.. ఢిల్లీ 13 మ్యాచ్ లలో గెలిచింది. ఇక ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులు కాగా... ఢిల్లీపై రాజస్థాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 222 పరుగులుగా ఉంది.

పిచ్ రిపోర్ట్:

ఈ మైదానంలో జరిగిన 2024 మొదటి ఐపీఎల్ మ్యాచ్ లో ఈ పిచ్ బ్యాటర్స్ కి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. బౌన్స్ ను బ్యాటర్లు బాగా ఆస్వాదించారు. ఈ క్రమంలోనే ఫేసర్లకు ఎలాంటి సపోర్టూ ఈ పిచ్ నుంచి దక్కలేదనే చెప్పాలి. దీంతో... రాజస్థాన్ - ఢిల్లీ మ్యాచ్ లోనూ అదే అంచనాలు ఉన్నాయి. రెండు వైపులా బ్యాటర్లకు ఇది స్వర్గధామం అని అంటున్నారు!