Begin typing your search above and press return to search.

కోల్ కతా వర్సెస్ బెంగళూరు... ఆసక్తికరంగా పిచ్ రిపోర్ట్!

మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ లలో ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ... పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

By:  Tupaki Desk   |   21 April 2024 4:22 AM GMT
కోల్ కతా వర్సెస్ బెంగళూరు... ఆసక్తికరంగా పిచ్ రిపోర్ట్!
X

ఐపీఎల్ సీజన్ 17లో సన్ డే సందడి మొదలవ్వబోతోంది. ఇందులో భాగంగా... ఈడెన్ గార్డెన్స్‌ లో కోల్‌ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటివరకూ మొత్తం 6 మ్యాచ్‌ లు ఆడిన కేకేఆర్.. 4 గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఆడిన 7 మ్యాచ్‌ లలో ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ... పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

ఆర్సీబీ విషయానికొస్తే... వారి బ్యాటర్లు కొంత ఫామ్‌ ను ప్రదర్శించడం ప్రారంభించినప్పటికీ.. వారి బౌలింగ్ పూర్తిగా గందరగోళంలో ఉందనే చెప్పాలి. ఫలితంగా... ఎంత మంచి స్కోరు చేసినా ప్రయోజనం దక్కడం లేదు! దీనికి గత మ్యాచ్ చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆర్సీబీ బౌలర్లు 20 ఓవర్లలో 287 పరుగులు సమర్పించుకున్నారు. డాట్ బాల్స్ కనిపించడం చాలా అరుదుగా జరిగింది.

అనంతరం చేదనలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 262 పరుగుల చేసింది. కొహ్లీ, డూప్లెసిస్, దినేష్ కార్తీక్ లు చెలరేగి ఆడారు. ముగ్గురూ 200పైన స్ట్రైక్ రేట్ మెయిటైన్ చేశారు. అయినా కూడా ఆర్సీబీకి విజయం దక్కలేదు. ఆర్సీబీలో కొహ్లీ 7 మ్యాచ్ లు ఆడి 361 పరుగులు చేయగా.. డుప్లెసిస్ 232 పరుగులు, దినేష్ కార్తీక్ 226 పరుగుల చేశారు. అయినా కూడా బౌలింగ్ విభాగం వీక్ గా ఉండటంతో విజయాలు దక్కడం లేదు!

ఇక కోల్ కతా విషయానికొస్తే... సునీల్ నరైన్ ఆల్ రౌండర్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. 6 మ్యాచ్ లు ఆడిన నరైన్ 276 పరుగులు సాధించడంతో పాటు 7 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక సాల్ట్ 201 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 140 పరుగులు దక్కించుకున్నారు. అయితే... టీం మొత్తం ఐకమత్యంగా రాణిస్తుండటం వీరికి కలిసొస్తుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు:

కోల్‌ కతా, బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 33 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో కోల్‌ కతా 19, ఆర్సీబీ 14 మ్యాచ్ లలో గెలిచాయి. ఇక బెంగళూరుపై కోల్‌ కతా అత్యధిక స్కోరు 222 కాగా... కోల్ కతా పై రాయల్ ఛాలెంజర్స్ అత్యధిక స్కోరు 213 గా ఉంది.

పిచ్ రిపోర్ట్:

కోల్‌ కతాలోని ఈడెన్ గార్డెన్స్ బ్యాటింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది! ఈ సమయంలో బ్యాటర్ల దూకుడుని నియంత్రించడానికి బౌలర్లు స్లో బంతులు, బౌన్సర్లు మొదలైన ట్విస్ట్ లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా చిన్న బౌండరీలను కలిగి ఉండటంతో... కాస్త స్ట్రోక్ ప్లేయర్స్ కి లూజు బాల్స్ వేస్తే స్టాండ్స్ వైపు చూడటం మినహా మరో ఆప్షన్ ఉండకపోవచ్చు.

ఇదే క్రమంలో... ఈ వేదికపై జరిగిన చివరి కేకేఆర్ - ఆర్సీబీ మ్యాచ్‌ లో శార్దూల్ ఠాకూర్ 29 బంతుల్లో 68, రింకు సింగ్ 33 బంతుల్లో 46 పరుగులు జోడించారు. ఫలితంగా కేకేఆర్ 204 పరుగులు చేసింది. స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మలు ఆర్సీబిని 123 పరుగుల వద్ద కట్టడి చేశారు.