Begin typing your search above and press return to search.

ఈ వారమే ఓటీటీలోకి సిద్ధు, గోపి.. ఇంకా ఎవరంటే?

అయితే టిల్లు స్క్వేర్, భీమా, కుంగ్ ఫూ పాండా, అమీ జాక్సన్ క్రాక్ సినిమాలపై ఓటీటీ ఆడియన్స్ దృష్టి బాగా ఉంది.

By:  Tupaki Desk   |   22 April 2024 9:20 AM GMT
ఈ వారమే ఓటీటీలోకి సిద్ధు, గోపి.. ఇంకా ఎవరంటే?
X

ప్రతి వారం.. సినీ ప్రియులను అలరించేందుకు అటు థియేటర్స్ లో.. ఇట్లు ఓటీటీల్లో సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు.. థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సహా పలు ఓటీటీల్లో అనేక సినిమాలు స్ట్రీమ్ అవ్వనున్నాయి. మూవీలు, వెబ్ సీరీస్ లు కలిపి17 స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 26వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు, మ్యాచో స్టార్ గోపీ చంద్ లేటెస్ట్ మూవీ భీమా.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు స్ట్రీమ్ అవ్వనున్నాయి.

నెట్‌ ఫ్లిక్స్

ఫైట్ ఫర్ ప్యారడైజ్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23

బ్రిగంటి (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 23

డెలివర్ మీ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 24

డెడ్ బాయ్స్ డిటెక్టివ్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 25

సిటీ హంటర్ (మూవీ)- ఏప్రిల్ 25

గుడ్ బై ఎర్త్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

ది అసుంత కేస్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

క్రాక్ (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 26

థ్యాంక్యూ గుడ్ నైట్ (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

జియో సినిమా

ది జింక్స్ పార్ట్ 2 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 22

వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 27

అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ వెబ్ సీరీస్ దిల్ దోస్తీ డైలమా ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్ట్రీమ్ అవ్వనుంది. లయన్స్ గేట్ ప్లేలో ది బీ కీపర్ ఇంగ్లీష్ మూవీ.. ఏప్రిల్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. బుక్ మై షోలో ఏప్రిల్ 26 నుంచి కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ మూవీ) స్ట్రీమింగ్ అవ్వనుంది.

అయితే టిల్లు స్క్వేర్, భీమా, కుంగ్ ఫూ పాండా, అమీ జాక్సన్ క్రాక్ సినిమాలపై ఓటీటీ ఆడియన్స్ దృష్టి బాగా ఉంది. వెబ్ సిరీసుల్లో గుడ్ బై ఎర్త్, దిల్ దోస్తీ డైలమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరి చూడాలి.. ఇవన్నీ ఎలాంటి వ్యూస్ దక్కించుకుంటాయో.