వైసీపీ ఫైనల్ సర్వే...ఈసారి మార్కులు రాకుంటే...?

వైసీపీ ఫైనల్ సర్వేకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటిదాకా చేసిన సర్వేలు ఒక ఎత్తు. ఈసారి చేసేది మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది ఈ సర్వే అంటున్నారు.

Update: 2023-07-21 17:32 GMT

వైసీపీ ఫైనల్ సర్వేకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటిదాకా చేసిన సర్వేలు ఒక ఎత్తు. ఈసారి చేసేది మరో ఎత్తు అన్నట్లుగా ఉంటుంది ఈ సర్వే అంటున్నారు. ఈ సర్వేను బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుందని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా అనేక సర్వేలు వైసీపీ వద్ద ఉన్నాయి. ఐ ప్యాక్ టీం సర్వేలు చేస్తోంది.

అలాగే పార్టీ పరంగా సర్వేలు, వివిధ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేస్తున్నారు. నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సర్వేలు తీసుకుని అన్నీ కలిపి వడపోసి ఆరు నెలల క్రితం తేల్చినది ఏంటి అంటే దాదాపుగా అరవై మంది దాకా ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని.

అయితే వారికి టైం ఇచ్చి పనితీరు మార్చుకోవాలని వైసీపీ హై కమాండ్ సూచించింది. అయితే ఇపుడు ఆ టైం కూడా ముగిసింది అని అంటున్నారు. దాంతో ఫైనల్ గా మరో విడత సర్వే చేస్తే పార్టీ ఆదేశాలను ఎంతవరకూ పాటించారు, ప్రజలకు ఎంత మేరకు చేరువ అయ్యారు అన్న దాని మీద అంచనా వస్తుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.

ఈసారి సర్వే మరింత లోతుగా ఉంటుంది అని అంటున్నారు. ఈ సర్వే పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉండబోతోందిట. ఈ సర్వేను పూర్తిగా గ్రామాలలోకి వెళ్ళి చేస్తారు అంటున్నారు. అలాగే అనేక కులాలు వర్గాలు వృత్తుల వారి నుంచి విభిన్న వర్గాల ప్రజల నుంది కూడా అభిప్రాయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఆ విధంగా ఎమ్మెల్యేలు ప్రజలతో ఎంత మేరకు మమేకం అవుతున్నారు. వారి పట్ల ప్రజల భావన ఎలా ఉంది. అభివృద్ధి మీద జనంలో ఉన్న సంతృప్తి స్థాయి ఏంటి, ప్రభుత్వ పధకాలు కార్యక్రమాల మీద జనం ఏమనుకుంటున్నారు. వ్యతిరేకత ఉంటే ఏ స్థాయిలో ఉంది ఇత్యాది విషయాలు అన్నీ కూలంకషంగా ఈ సర్వే చూపిస్తుంది అని అంటున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఈ సర్వే నిఘా వర్గాలు రంగంలోకి దిగాయని అంటున్నారు. అలాగే ఐ ప్యాక్ టీం తో పాటు వివిధ ఏజెన్సీలకు కూడా సర్వే బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ సర్వే నివేదిక చేతిలో పడగానే వైసీపీ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది అని అంటున్నారు.

పనితీరు బాగులేని వారికి ఈసారి ఫైనల్ డెసిషన్ తీసుకుని పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు మొత్తానికి ఇపుడు వైసీపీ చేయిస్తున్న ఈ ప్రత్యేక సర్వే పార్టీలో గుబులు పుట్టిస్తోంది అని అంటున్నారు. ఒక విధంగా వైసీపీలో చాలా మంది జాతకాలను తేల్చే సర్వేగానే దీన్ని చూస్తున్నారు. వివిధ ఏజెన్సీలతో పాటు నిఘా వర్గాలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నందువల్ల సర్వేశ్వరులను ప్రసన్నం చేసుకునే వీలు కూడా ఉండదని అంటున్నరు. జనంలో ఉన్న ఒరిజినల్ ఒపీనియం బయటకు వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి గుండె దడ పుట్టించేలా ఈసారి సర్వే నివేదిక అయితే ఉంటుంది అని అంటున్నారు.


Tags:    

Similar News