షాకింగ్ రిపోర్ట్... హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎన్ని మరణాలో తెలుసా?

ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయడమే కాదు.. ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంటాయి రోడ్డు ప్రమాదాలు

Update: 2024-10-21 08:30 GMT

ఓ వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేయడమే కాదు.. ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంటాయి రోడ్డు ప్రమాదాలు. వీటి నివారణకు ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వాహనాలు నడిపేవారి అలసత్వమో, నిర్లక్ష్యమో, లెక్కలేని తనమో ఈ ప్రమాదాలకు కారణమవుతుందని అంటున్నారు.

ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడపరాదని.. సీటు బెల్టు ధరించడం చాలా ముఖ్యమని.. అతివేగం ప్రమాదకరమని ఎన్ని చెప్పినా.. వాటిని పరిగణలోకి తీసుకోకపోవడంతో జరిగేవి జరుగుతూనే ఉండటం గమనార్హం! ఈ సమయంలో... గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల లెక్కలు తెరపైకి వచ్చాయి. వీటిలో 55% ప్రమాదాలు ఆరు రాష్ట్రాల్లోనే జరుగుతుండటం గమనార్హం.

అవును... దేశంలో గత ఏడాది జరిగిన 1,73,000 రోడ్డు ప్రమాద మరణాల్లో సుమారు 55% ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోనే జరిగాయని ఘణాంకాలు చెబుతున్నాయి! వీటిలో ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రం మరణాల్లో ఆందోళనకరమైన పెరుగుదలను నమోదు చేసింది.

ఇందులో భాగంగా... 2022తో పోలిస్తే మహారాష్ట్ర 1శాతం, తమిళనాడు 2.6, మధ్యప్రదేశ్ 2.8, ఉత్తరప్రదేశ్ 4.7, కర్ణాటక 5.2 శాతం అధికంగా మరణాలు నమోదు చేయగా... రాజస్థాన్ లో మాత్రం ఈ పెరుగుదల 6 శాతంగా ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో పంచుకున్న వివాల ప్రకారం ఈ డేటా విడుదలైంది!

ఈ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగటున రోజుకు 474 మంది చనిపోయారని.. ప్రతీ మూడు నిమిషాలకు ఒకరు ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లు ధరించకపోవడం వల్ల 70% మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు.

ఈ స్థాయిలో రోడ్డు మరణాల సంఖ్య పెరుగుతుండటంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ఇంజినీర్లు అన్ని ప్రాణాంతక ప్రమాదాలనూ విచారించి.. కారణాలను కనుగొని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు.

2003లో రోడ్డు మరణాలు సంభంవించిన టాప్ - 5 రాష్ట్రాలు:

ఉత్తర ప్రదేశ్ - 23,652

తమిళనాడు - 18,347

మహారాష్ట్ర - 15,366

మధ్య ప్రదేశ్ - 13,798

కర్ణాటక - 12,321

రాజస్థాన్ - 11,762

Tags:    

Similar News