ఆటో షోలో వరల్డ్ ఫస్ట్ ఫ్లయింగ్ కార్... ధర, వివరాలివే!
అవును... ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారును డెట్రాయిట్ ఆటో షోలో ఆవిష్కరించారు. అలెఫ్ ఏరోనాటిక్స్ పేరుతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు ఇది.
నేటి సాంకేతిక యుగంలో రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రోజుకు వేల మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయన్నా అతిశయోక్తి కాదేమో. ఈ క్రమంలో ఇప్పటి వరకు చూసిన డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్ల అనంతరం ఎగిరే కార్లు కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా ఈ కారును ప్రదర్శనకు ఉంచి, వివరాలు వెల్లడించారు!
అవును... ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారును డెట్రాయిట్ ఆటో షోలో ఆవిష్కరించారు. అలెఫ్ ఏరోనాటిక్స్ పేరుతో రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు ఇది. ఈ ఏడాది జూన్ లో చట్టపరమైన అనుమతి పొందిన ఈ కారు నమూనా ప్రపంచం ముందు ఆవిష్కరించబడింది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఈ ఎగిరే కారు ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే సరిపోతుందని తెలుస్తుంది! ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు కాగా... దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గాల్లో 110 మైళ్లు అనగా 177 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అదేవిధంగా 200 మైళ్లు అనగా 322 కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించొచ్చు. ఇక ధర విషయానికొస్తే 3 లక్షల డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.2.46 కోట్లు అన్నమాట.
అదేవిధంగా ప్రయాణీకులు 180 ప్లస్ డిగ్రీ వీక్షణలను ఆస్వాదించగలరని కారు కంపెనీ పేర్కొంది. తాజాగా కార్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమ్ దుఖోవ్నీ ఈ విషయాలపై మరింత స్పందించారు. ఇప్పుడు ఆవిష్కరించిన కారు ఫైనల్ వెర్షన్ కాదని... కాకపోతే దాదాపు ఇలానే ఉంటుందని తెల్లిపారు. అదేవిధంగా 15 నిమిషాలకంటే తక్కువ సమయంలోనే ఈ కారును నడపడం, ఫ్లై చేయడం నేర్చుకోవచ్చని అన్నారు.