ఇండియాలో టాప్ - 10 సేఫ్టీ కార్లు ఇవే... వీటిలో లాస్య నందిత కారు లేదు!

కారు ప్రమాదంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్డుపై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది.

Update: 2024-02-23 08:42 GMT

కారు ప్రమాదంలో బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్డుపై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంతో లారీని ఢీకొట్టడంతో సుమారు 100 - 150 మీటర్లపాటు అదుపుతప్పి ప్రయాణించిన కారు.. రెయిలింగ్‌ కు తగిలిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లాస్య నందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో... కారు ప్రయాణంలో రక్షణపై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.

అవును... సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కారు ప్రయాణంలో భద్రతకు సంబంధించిన అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఇందులో భాగంగా కార్లలో రక్షణపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో లక్షలు పోసి కార్లు కొన్నప్పటికీ ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా ఆమె ప్రమాదం జరిగిన సమయంలో ఉపయోగించిన కారు మారుతీ సుజుకీ కంపెనీకి చెందినది కావడంతో.. ఆ బ్రాండ్ పై కామెంట్లు వినిపిస్తున్నాయి!

కారు ప్రమాదంలో లాస్య మరణించడంతో ఫోర్ వీలర్ సేఫ్టీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ సమయంలో ఫోర్ వీలర్స్ విషయంలో నెట్టింట పలు సూచనలు దర్శనమిస్తున్నాయి. ఇందులో భాగంగా సెఫ్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అంటున్నారు. కార్లు కొనేటప్పుడు.. మైలేజీ ఎక్కువ, మెయింటినెన్స్ తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ, ఇంట్రస్ట్ రేట్ తక్కువ వంటి విషయాలను కాకుండా.. ప్రధానంగా సేఫ్టీ ఏ స్థాయిలో ఉందనే విషయంపైనే దృష్టిపెట్టాలని అంటున్నారు!

ఇందులో భాగంగా ప్రధానంగా నెంబర్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు ప్రధాన అంశం అనే విషయం మరిచిపోకూడదని చెబుతున్నారు. ఇదే సమయంలో బాడీ మెటల్ పైనా దృష్టి పెట్టాలని చెబుతున్నారు! అదేవిధంగా... యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్ మొదలైన విషయాలపై దృష్టిసారించాలని అంటున్నారు.

ఈ సమయంలో గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్.సి.ఏ.పి) ప్రకారం భారత్ లో టాప్ 10 సేఫెస్ట్ కార్ల వివరాలు తెరపైకి వచ్చాయి. అవేమిటనేది ఇప్పుడు చూద్దాం...!!

టాటా హారియర్ / టాటా సఫారి

వోక్స్‌ వ్యాగన్ వర్చూస్ / వోక్స్‌ వ్యాగన్ టిగువాన్

స్కోడా స్లావియా / స్కోడా కుషాక్

మహీంద్రా స్కార్పియో - ఎన్

హ్యూండాయ్ వెర్నా

టాటా పంచ్

మహీంద్రా ఎక్స్.యూవీ300

టాటా ఆల్ట్రోజ్

టాటా నెక్సాన్

మహీంద్రా ఎక్స్.యూవీ700

Tags:    

Similar News