రోల్స్ రాయిల్స్ ఘోస్ట్ కొత్త మోడల్ లాంచ్... ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

రోల్స్ రాయిల్స్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొనే స్థోమత ఉన్నా లేకున్నా వీటి గురించి తెలుసుకోవాలని మాత్రం చాలా మందికి తీవ్ర ఆసక్తి ఉంటుందని అంటారు

Update: 2025-02-07 11:30 GMT

రోల్స్ రాయిల్స్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొనే స్థోమత ఉన్నా లేకున్నా వీటి గురించి తెలుసుకోవాలని మాత్రం చాలా మందికి తీవ్ర ఆసక్తి ఉంటుందని అంటారు. ఆ కార్ల డిజైన్ చూస్తేనే ఏదో తెలియని కిక్ అనేవారూ లేకపోలేదు. ఈ సమయంలో ఆ సంస్థ ఇండియాలో ఘోస్ట్ సిరీస్ 2 లైనప్ ను ప్రారంభించింది.

అవును... అత్యంత విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ అయిన రోల్స్ రాయల్స్ తాజాగా భారత్ లో ఘోస్ట్ సిరీస్ 2 లైనప్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా... తన ప్రామాణిక ఘోస్ట్ సిరీస్ 2 తో పాటు ఎక్స్ టెండెడ్ ఘోస్ట్ సిరీస్ 2, బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 మోడళ్లను భారతదేశంలో విడుదల చేసింది.

ఈ సందర్భంగా వాటి పీచర్స్ వేరే లెవెల్ అనే కామెంట్లను సొంతం చేసుకుంటున్నాయి. ప్రధానంగా తాజాగా ఘోస్ట్ సిరీస్ 2 కొత్త రకం హెడ్ అలిట్స్ ని ఎల్.ఈ.డీ. డీఆరెల్స్ తో డిజైన్ చేయగా.. ఫ్రంట్ బంఫర్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఇక వెనుక భాగంలో కొత్తగా ఎల్.ఈ.డీ. టెయిల్ లైట్లు చేర్చారు. అదే విధంగా... 22 అంగుళాల 9-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో.. క్యాబిన్ ఫీచర్స్ విషయానికొస్తే.. డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఇంఫోటైన్ మెంట్ సిస్టం ను కొత్త కనెక్టివిటీ ఫీచర్స్ తో అప్ గ్రేడ్ చేశారు. ఈ కొత్త మొడల్ లో ట్విట్ ఛార్జ్డ్ వీ12 ఇంజిన్ అమర్చారు.

ఈ ఇంజిన్ లో మెరుగైన ట్యూనింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ కారులో 18 స్పీకర్ ఆడియో సిస్టం, అప్ గ్రేడ్ చేయబడిన 1400 వాట్ యాంప్లిఫైయర్ ఉన్నాయి. ఇదే సమయంలో... సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే పక్కన కొత్త స్పిరిట్ ఆఫ్ ఎక్స్ టసీ క్లాక్ క్యాబినెట్ ఉంది. క్యాబిన్ లోపల గ్రే స్టెయిండ్ యాష్ అనే కొత్త ఇంటీరియర్ మెటీరియల్ ను ఉపయోగించారు.

మరి ఇన్నేసి ప్రత్యేకతలున్న రోల్స్ రాయిల్స్ ఘోస్ట్ సిరీస్ 2 భారత్ లో మూడు వేరియంట్లలోనూ అందుబాటులో ఉండగా.. వాటి ధరల వివరాలు ఢిల్లీ, చెన్నై షోరూం లలో ఎలా ఉన్నయనేది ఇప్పుడు చూద్దామ్..!

ఇందులో స్టాండర్డ్ ఘోస్ట్ సిరీస్ 2 ఎక్స్ షోరూం ధర రూ.8.95 కోట్లుగా ఉండగా.. ఎక్స్ టెండెడ్ ఘోస్ట్ సిరీస్ 2 ఎక్స్ షోరూం ధర రు.10.19 కోట్లుగా ఉంది. ఇక బ్లాక్ బీజ్ ఘోస్ట్ సిరీస్ 2 విషయానికొస్తే.. ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.10.52 కోట్లు కావడం గమనార్హం.

Tags:    

Similar News