భారత్ కోసం టెస్లా స్పెషల్స్ ఇవే... ధరలెంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 'టెస్లా' త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.;
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 'టెస్లా' త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దాని భారతీయ అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ.. రెండు కారు మోడల్స్ హోమోలోగేషన్, సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటోంది. ఏదైనా.. దేశంలో కార్లను విక్రయించాలంటే.. ఈ ప్రక్రియ తప్పనిసరి.
ఈ సమయంలో... టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారత్ లో రెండు మోడల్స్ కోసం రెండు దరఖాస్తులు సమర్పించింది. అవే... 'మోడల్ వై', 'మోడల్ 3'! వాస్తవానికి టెస్లా భారత్ లో తన కార్యకలాపాలను కాస్త తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఈవీ వాహనాలతో మొదలు పెట్టాలని భావిస్తోందని అంటున్నారు.
ఇప్పుడు ఈ రెండు కార్ల ప్రత్యేకతలు, ధరల వివరాలపై ఆన్ లైన్ వేదికగా ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ కార్లను కంపెనీ బెర్లిన్ ఫ్యాక్టరీలో తయారు చేస్తోందని.. భారత్ తో పాటు యూరప్, ఉత్తర అమెరికా, చైనా మార్కెట్ లలో కూడా విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆ మోడల్స్ వివరాలు తెలుసుకుందాం..!
అవును... వీలైనంతలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లతో భారత్ లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని టెస్లా యోచిస్తున్నట్లు నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రూ.21 లక్షల ఈవీని ప్రవేశపెట్టవచ్చనే కథనాలొచ్చాయి. అయితే... తాజా నివేదికల ప్రకారం.. కాస్త ఎక్కువ ధర ఉన్న మోడల్స్ నే సిద్ధం చేయాలని టెస్లా భావిస్తోందని అంటున్నారు.
వీటిలో టెస్లా మోడల్ వై విషయానికొస్తే... దీనికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది మొదట్లోనే ప్రపంచ మార్కెట్ లో ప్రారంభించబడింది. దీనికి ముందూ వెనుకా ఎల్.ఈ.డీ. లైట్లతో వస్తుంది. సెంటర్ కన్సోల్ లో 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు వెనుక ప్రయాణికులకు 8 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్ కూడా లభిస్తుంది.
ఈ “మోడల్ వై”ని రే ర్ వీల్ డ్రైవ్ (ఆర్.డబ్ల్యూ.డి.), ఆల్ వీల్ డ్రైవ్ (ఏ.డబ్ల్యూ.డీ) అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. ఆర్.డబ్ల్యూ.డి. వేరియంట్ లో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 719 కి.మీ. ప్రయాణించవచ్చని చెబుతుండగా.. ఏ.డబ్ల్యూ.డీ వేరియంట్ పూర్తి జ్యూస్ అప్ లో 662 కి.మీ వరకూ ప్రయాణించొచ్చని అంటున్నారు.
ఇక ఇందులో సింగిల్ మోటార్ ఆర్.డబ్ల్యూ.డి. మోడల్ వై 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి 5.9 సెకన్ల సమయం పడితే... డ్యూయల్ మోటార్ ఏ.డబ్ల్యూ.డీ ట్రిమ్ 4.3 సెకన్ల లోనే గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. భారత్ మార్కెట్ లో ఈ మోడల్ వై కార్ల ధర సుమారు రూ.70 లక్షల వరకూ ఉండోచ్చని అంటున్నారు.
ఇక మోడల్ 3 విషయానికొస్తే... ఇది ప్రపంచవ్యాప్తంగా టెస్లా బ్రాండ్ ఎంట్రీ లెవెల్ అని చెబుతున్నారు! ఈ సెడాన్ వెహికల్ లాంగ్ రేంజ్ ఆర్.డబ్ల్యూ.డీ, లాంగ్ రేంజ్ ఏ.డబ్ల్యూ.డీ, పెర్ఫార్మెన్స్ అనే మూడు ఉత్పన్నాలలో అమ్ముడవుతోంది. ఇంటీరియర్ విషయంలో ఇది మోడల్ వైతో దాదాపు సమానంగానే ఉంటుంది.
ఇందులో కూడా 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ తో పాటు వెనుక ప్రయాణికులకు 8 అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్ కూడా లభిస్తుంది. ఇక ఒకసారి ఛార్జ్ చేస్తే... ఆర్.డబ్ల్యూ.డీ వెర్షన్ 584 కి.మీ.. ఏ.డబ్ల్యూ.డీ. వెర్షన్ 557 కి.మీ. రేంజ్ ని అందిస్తుంది. ఇందులో ఆర్.డబ్ల్యూ.డీ. 4.9 సెకన్లలో గంటకు 100 కి.మీ రేంజ్ ను అందుకుంటే.. ఏ.డబ్ల్యూ.డీ. 100 కి.మీ. రేంజ్ ని అందుకోవడానికి 4.2 సెక్షన్ల సమయం తీసుకుంటుంది.
ఇక “పెర్ఫార్మెన్స్” వేరియంట్ విషయానికొస్తే... ఇది గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.9 సెకన్ల సమయం మాత్రమే తీసుకుంటుందని చెప్పడం గమనార్హం. దీని ఎక్స్ షోరూమ్ ధర భారత్ లో రూ.30 లక్షల వరకూ ఉండోచ్చని చెబుతున్నారు. కాగా... యూఎస్ వాహనాలు 15% సుంకంతో భారత్ లో దిగుమతి చేసుకోవాలనే సంగతి తెలిసిందే!