కొత్త వ్యాపారంలోకి అంబానీ ఎంట్రీ... బిగ్ మార్జిన్స్ ఆఫర్!

ఈ నేపథ్యంలో... ఇప్పటికే ఈ పరిశ్రమలో పాతుకు పోయిన పెద్ద పెద్ద బ్రాండ్లను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు.

Update: 2024-11-08 16:28 GMT

ఆసియాలోని అగ్రశేణి వ్యాపార దిగ్గజాల్లో ఒకరైన ముఖేష్ అంబానీ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారంట. ముకేష్ పట్టిందల్లా బంగారమే అనే నానుడి వేళ... కంపా కోలాతో శీతల పానియాల రంగంలో విజయవంతమవడానికి సహకరించిన స్ట్రాటజీతోనే దీనిలోనూ అవలంభించాలని కోరుకుంటున్నారంట. బిజినెస్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

అవును... ముకేష్ అంబానీ రూ.42,694.9 కోట్లతో భారీ స్నాక్ (చిరు తిండి) వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారంట. ఈ నేపథ్యంలో... ఇప్పటికే ఈ పరిశ్రమలో పాతుకు పోయిన పెద్ద పెద్ద బ్రాండ్లను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. చిప్స్, నాంకీన్, బిస్కెట్లను ధరల వ్యూహాలతో మార్కెట్ లోకి తీసుకురానున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో... రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ తన స్కాక్ బ్రాండ్ లను స్నాక్టాక్ పేర్లతో ప్రారంభించాలని యోచిస్తోందని.. బిస్కెట్ లైన్ ను ఇండిపెండెన్స్ అని పిలుస్తారని అంటున్నరు. ఈ సమయంలో పోటీ ధరలను అందించడంతో పాటు.. కంపెనీ రిటైలర్ లకు ఉదారంగా సుమారు 20 శాతం వరకూ మార్జిన్ ను ఇస్తోందని అంటున్నారు.

ఇతర స్నాక్ కంపెనీలు అందించే 8 నుంచి 15 శాతం మార్జిన్ కంటే ఇది చాలా ఎక్కువ. ఇక డిస్టిబ్యూటర్లకు 8 శాతం.. పనితీరు ఆధారంగా మరో 2 శాతం అదనంగా ప్రోత్సాహకం గా ఇవ్వనున్నారని చెబుతున్నారు. దీంతో.. స్నాక్స్ బిజినెస్ లో రిలయన్స్ పెద్ద పోటీనే తీసుకురానుందని అంటున్నారు పరిశీలకులు.

కాగా... భారతీయ స్నాక్స్ మార్కెట్ లో ప్రస్తుతం బ్రిటానియా, హల్దీరాం, పెప్సికో వంటి స్థిరపడిన బ్రాండ్స్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంలో భారత్ మార్కెట్ ను ఇవే శాసిస్తున్నాయి. వీటి మార్కెట్ ప్రతీ ఏడాది సుమారు 9 శాతం చొప్పున విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో.. రిలయన్స్ ఎంట్రీ తర్వాత పరిణామాలపై ఆసక్తి నెలకొంది!

Tags:    

Similar News