ఇన్ఫోసిస్ కు బ్యాడ్ న్యూస్.. రూ.12వేల కోట్ల డీల్ క్యాన్సిల్
దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కు ఇదో చేదువార్తగా చెప్పాలి. ఎందుకుంటే.. మూడు నెలల క్రితం ఒక కంపెనీతో చేసుకున్న భారీ డీల్ క్యాన్సిల్ అయ్యింది.
దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కు ఇదో చేదువార్తగా చెప్పాలి. ఎందుకుంటే.. మూడు నెలల క్రితం ఒక కంపెనీతో చేసుకున్న భారీ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ భారీ డీల్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.12వేల కోట్లు. గ్లోబల్ కంపెనీతో కుదుర్చుకున్న ఈ డీల్ రద్దైన విషయాన్ని వెల్లడించింది. దీంతో.. రానున్న రోజుల్లో ఐటీ సంస్థలు ఎదుర్కొనే అనిశ్చితిని కళ్లకు కట్టినట్లుగా ఈ ఉదంతం ఉందని చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్ కు సంబంధించి రెండు సంస్థల మధ్య డీల్ కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థల మధ్య దాదాపు 15 ఏళ్ల పాటు రిలేషన్ సాగే వీలుంది. ఇంత భారీ ప్రాజెక్టు ఒక దశ దాటి కీలక దశకు చేరుకున్న సందర్భంలో అనూహ్యంగా రద్దు నిర్ణయం వెలువడటం షాకింగ్ గా మారింది.
గ్లోబల్ కంపెనీతో చేసుకున్న డీల్ రద్దు అయినట్లుగా ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్ అనుసరించటం లేదని పేర్కొన్నారు. అయితే.. ఇక్కడో విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. మొన్నటివరకు ఇన్ఫోసిస్ కు సీఎఫ్ వోగా వ్యవహరిస్తున్న నీలాంజన్ రాయ్ సంస్థ నుంచి వైదొలగటం.. అది కాస్తా అకస్మాత్తుగా ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు వారాల్లోపే ఇంత భారీ డీల్ క్యాన్సిల్ కావటం అయితే.. ఈ చర్చ మొత్తం అత్యున్నత స్థాయిల్లోనే జరిగినట్లుగా చెబుతున్నారు.
దేశంలోనే రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సంస్థ మెరుగైన డిజిటల్ సేవలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందించేందుకు వీలుగా గ్లోబల్ కంపెనీతో ఎంవోయు చేసుకోవట తెలిసిందే. గ్లోబల్ కంపెనీతో ఇన్ఫోసిస్ కు డీల్ జరిగిందన్న విషయాన్ని ప్రకటించారు. కానీ.. స్వల్ప వ్యవధిలోనే ఇంత భారీడీల్ మిస్ కావటం షాకింగ్ గా మారింది.ఇదిలా ఉంటే.. ఈ డీల్ రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ఎక్సైంజ్ ఫైలింగ్ కు అందించారు.