రిల‌య‌న్స్- వాల్ట్ డిస్నీమ‌ధ్య డీల్ కుదిరిన‌ట్లేనా?

మీడియా రంగంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లో విలీనం చేసేందుకు రిల‌య‌న్స్- వాల్ట్ డిస్నీ కో మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది

Update: 2024-02-26 10:48 GMT

మీడియా రంగంలో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లో విలీనం చేసేందుకు రిల‌య‌న్స్- వాల్ట్ డిస్నీ కో మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంపై ఇరు ప‌క్షాలు సంత‌కాల ప్ర‌క్రియ కూడా పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. రెండు కంపెనీల విలీనం త‌ర్వాత రిల‌య‌న్స్ సంస్థ‌కు 61 శాతం, మిగిలిన 39 శాతం వాటా వాల్ట్ డిస్నీ చేతిలో ఉంటుందని బ్లూంబర్గ్ తెలిపింది.

దీనికి సంబంధించి ఇరు సంస్థ‌లు ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌ చేయ‌కున్నా విలీనం త‌ర్వాత రెండు సంస్థ‌ల మ‌ధ్య న‌గ‌దు షేర్ల బ‌దిలీ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. బ్రాడ్ కాస్ట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ `టాటా ప్లే లిమిటెడ్` లో డిస్నీ సంస్థ‌కు గ‌ల మైనార‌టీ వాటాను రిల‌య‌న్స్ కొనుగోలు చేస్తుంద‌ని వినిపిస్తుంది. ఎంట‌ర్ టైన్ మెంట్ ఇండ‌స్ట్రీలో ఈ డీలో ఓ పెద్ద ముంద‌డుగు అని చెప్పొచ్చు.

వాల్ట్ డిస్నీ కో ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి భారత దేశంలో క్రియాశీల వ్యాపారంలోకి తిరిగి వస్తుంది. సోనీ ఇంతకు ముందు జీ స్టూడియోస్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ప్లాన్ చేసింది కానీ చర్చలు సఫలం కాలేదు. 2022 లో వాల్ట్ డిస్నీ ని ప‌క్క‌ను నెట్టేసి ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాల్ట్ డిస్నీకి సబ్ స్క్రైబర్లను కాపాడుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.

మరోవైపు దేశీయంగా పలు వినోద, మీడియా వ్యాపారాల్లో రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. నెట్‌ఫ్లిక్స్.. అమెజాన్ ప్రైమ్‌లను ఆకర్షించిన దేశీయ మీడియా, వినోద రంగంపై పట్టు సాధించేందుకు రిలయన్స్ తహతహలాడుతున్నది. వాల్ట్ డిస్నీ, రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పాటయ్యే సంస్థ దేశీయ వినోద రంగ సంస్థల్లో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. రెండు సంస్థ‌లు చేతులు క‌ల‌ప‌డంతో మిగ‌తా కార్పోరేట్ ల‌పై ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది.

Tags:    

Similar News