శ్రీహర్ష మాజేటి.. నందన్ రెడ్డిలు తెలిసిన తెలుగోళ్లు ఎందరు?
తమ సంస్థల్ని వ్యవస్థలుగా మారుస్తున్న తెలుగోళ్ల గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. వీరి వెనుక గాడ్ ఫాదర్లు ఎవరూ లేకుండా స్వయంకృషితో ఎదగటం వీరి గొప్పతనం.
శ్రీహర్ష మాజేటి.. నందన్ రెడ్డి.. వంశీ గోకరాజు.. జీఎస్ రాజు.. సత్యనారాయణ రెడ్డి.. సత్యనారాయణ చావ.. భాస్కర్ రావు.. అరవింద్ సంకా.. పవన్ గుంటుపల్లి.. ఈ పేర్లు.. వీరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో మీకు తెలుసా? గడిచిన కొంతకాలంగా తమ పని తాము చేసుకుంటూ.. మీడియాలో ఏ మాత్రం ఫోకస్ కాకుండా.. సోషల్ మీడియాలోనూ పెద్దగా హడావుడి చేయకుండా తాము ఎదగటమే కాదు.. తమ సంస్థల్ని వ్యవస్థలుగా మారుస్తున్న తెలుగోళ్ల గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. వీరి వెనుక గాడ్ ఫాదర్లు ఎవరూ లేకుండా స్వయంకృషితో ఎదగటం వీరి గొప్పతనం.
ఇంతా చేసి.. సాటి తెలుగు వారికి కోసం పరిచయం లేనంత లో ఫ్రొఫైల్ మొయింటైన్ చేయటం వీరికే సాధ్యమని చెప్పాలి. తాజాగా ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్.. హురున్ సంస్థలు కలిసి స్వశక్తితో.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ వ్యాపారాల్ని భారీగా చేస్తున్న టాప్ 200 మంది భారతీయుల్ని ఎంపిక చేస్తూ ఒక జాబితాను తయారు చేశారు. ఇందులో 12 మంది తెలుగువారు ఉన్నారు. ఇందులో కిమ్స్ భాస్కర్ రావు తప్పించి.. పాత తరానికి.. కొత్త తరానికి తెలిసిన తెలుగోళ్లు లేకపోవటం ఆసక్తికరంగా చెప్పాలి.
ఈ నవతరం తెలుగువారి ప్రత్యేకత ఏమంటే తాము చేసే పని.. తాము సాధించే విజయాల్ని ప్రచారం చేసుకోవటానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బయటకు పెద్దగా ఫోకస్ కారు. తమ పని తాము చేసుకుంటూ పోవటం.. తాము నెలకొల్పిన సంస్థల్ని అంతకంతకూ విస్తరించుకుంటూ వెళ్లటమే తప్పించి.. మరో ధ్యాస లేనట్లుగా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పూర్తిస్థాయి ప్రైవేటు జీవితాన్ని సాగిస్తూ ఉంటారని చెప్పాలి.
అలాంటి 12 మంది వారి సంస్థల్ని చూస్తే.. వీరు తెలియకున్నా.. వీరి సంస్థలు.. వారి సేవల్ని నిత్యం పొందుతున్న విషయాన్ని గుర్తిస్తారు. అంతేకాదు.. జాబితాలో చోటు దక్కించుకున్న పన్నెండు మందిలో సగం మంది (ఆరుగురు) 2015 తర్వాతే తమ సంస్థల్ని నెలకొల్పిన వారే. ఇక.. 2000ను ల్యాండ్ మార్కు ఇయర్ గా పేర్కొంటే.. జాబితాలో ఉన్న అన్ని కంపెనీలు 2000.. లేదంటే ఆ తర్వాత నెలకొల్పినవే కావటం విశేషం.
ర్యాంకు పేరు సంస్థ విలువ (రూ.కోట్లలో)
03 శ్రీహర్ష మాజేటి స్విగ్గీ 1.01లక్షలు
03 నందన్ రెడ్డి స్విగ్గీ 1.01లక్షలు
25 వంశీ గోకరాజు * దెక్కన్ ఫైన్ 31.6వేలు
31 సత్యనారాయణరెడ్డి ఎంఎస్ఎన్* 26.2వేలు
34 సత్యనారాయణ చావ లారస్ లాబ్స్ 24.9వేలు
40 భాస్కర్ రావు కిమ్స 21.9వేలు
98 అరవింద్ సంకా ర్యాపిడో 9.2వేలు
98 పవన్ గుంటుపల్లి ర్యాపిడో 9.2వేలు
119 మధుకర్ గంగిడి మెడ్ ప్లస్ 8.2వేలు
142 రాఘవేంద్రరావు బొండాడ* 6.4వేలు
160 రాజ్ ఫణి జాగిల్ ప్రీపెయిడ్ 5.3వేలు
162 అశోక్ రెడ్డి టీమ్ లీజ్ సర్వీసెస్ 5.2వేలు
* (వంశీ గోకరాజు, జీఎస్ రాజులకు చెందిన దెక్కన్ ఫైన్ కెమికల్స్)
* (సత్యనారాయణరెడ్డికు చెందిన ఎంఎస్ఎన్ లేబోరేటరీస్)