ఘోరం.. ఇంటికొచ్చి ఐదుగురిని కత్తితో నరికాడు!
నెల్లూరు జిల్లా కావలికి చెందిన 55 ఏళ్ల పుల్లా సుబ్బారెడ్డికి కావలి రూరల్ మండలానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ అప్పు ఇచ్చాడు.
అప్పు ఇవ్వటమే అతని తప్పు అయ్యింది. అందుకు ప్రాణాల్నిపోగొట్టుకోవాల్సి వచ్చింది. పట్టపగలు అందరూ చూస్తుండగా చెలరేగిపోయిన వైసీపీ నేత ఒకరు కావటి పట్టణంలో ఆరాచకాన్ని స్రష్టించారు. ఇంటికి వెళ్లి మరీ కత్తితో నరికిన ఉదంతంలో ఒకరు మరణించగా.. మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంకో ముగ్గురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అసలేం జరిగిందంటే..
నెల్లూరు జిల్లా కావలికి చెందిన 55 ఏళ్ల పుల్లా సుబ్బారెడ్డికి కావలి రూరల్ మండలానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ అప్పు ఇచ్చాడు. కానీ.. తీసుకున్న అప్పును సుబ్బారెడ్డి తీర్చలేకపోయాడు. దీంతో.. ఆటోనగర్ లో తనకున్న ఇంటిని రాసి ఇచ్చేశాడు. దీంతో ఆ ఇంట్లోనే సురేశ్ ఉండసాగారు. ఇంటి కింది పోర్షన్ లో తాను ఉంటూ.. పై పోర్షన్ లో తనకు మిత్రుడైన శ్రీనివాసులకు అద్దెకు ఇచ్చాడు.
కొంతకాలం గడిచిన తర్వాత నుంచి సుబ్బారెడ్డి ఆ ఇంటిని వేరే వారికి అమ్మేందుకు వీలుగా ఇంటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఇది కాస్తా వివాదంగా మారింది. పోలీసుల వద్దకు పంచాయితీకి వెళ్లింది. అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వద్దకు వెళ్లింది. ఇదిలా ఉంటే..తాజాగా సుబ్బారెడ్డి తన సమీప బంధువు విజయ రెడ్డి మరికొందరు మహిళల్ని వెంట పెట్టుకొని సురేశ్ ఇంటికి వెళ్లారు. పొలం నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన సురేశ్ ను నిలదీసి.. ఇంటిని ఖాళీ చేయాలన్నాడు. దీనికి ఒప్పుకోని నేపథ్యంలో విజయ రెడ్డి సురేశ్ ను కత్తితో నరికేశాడు. దీంతో.. అతడు అక్కడికక్కడ మరణించాడు.
అదేసమయంలో అక్కడకు వచ్చిన సురేశ్ కుమార్తె సుష్మను కత్తితో పొడిచారు. ఈ ఘర్షణతో ఇంటి పై పోర్షన్ లో ఉన్న సురేశ్ స్నేహితుడు.. అతడి కొడుకు బయటకు రాగా.. వారిని కూడా కత్తితో పొడిచాడు. ఇలా మొత్తం ఐదుగురిని విచక్షణ రహితంగా కత్తితో పొడవటంతో అక్కడ బీతావహ పరిస్థితి నెలకొంది. ఐదుగురిలోసురేశ్ మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతం కావలిలో సంచలనంగా మారింది. మరీ.. ఇంత బరితెగింపు ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.