తెలంగాణ యువకుడి దారుణ హత్య.. ప్రేమ వివాహ ఫలితమా?
అవును... తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మూసీ కాలువ గట్టుపై సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు మామిళ్లగడ్డకు చెందిన కృష్ణగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు! అయితే.. ఇది పరువు హత్య అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు అత్యంత దారుణంగా ఉన్నాయని అంటున్నారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు చూద్దామ్!
అవును... తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మూసీ కాలువ గట్టుపై సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు మామిళ్లగడ్డకు చెందిన కృష్ణగా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో విచక్షణా రహితంగా కొట్టడంతో కృష్ణ తల పగిలి చనిపోయినట్లు చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పిల్లలమర్రి వెళ్లే దారిలో మూసీ కాలువ గట్టుపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారంట. దీంతో.. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. బాధితుడిని మరోచోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి కాలువపై పడేసి ఉంటారని అనుమానిస్తున్నారని అంటున్నారు.
అనంతరం పోలీసులు కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో.. కృష్ణ మరణవార్త విని భార్య గాయత్రి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు వెంటనే నిందితులను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అయితే... ఆరు నెలల క్రితం కృష్ణకు వివాహం జరగ్గా.. అది కులాంతర వివాహం అని చెబుతున్నారు. వేరే కులానికి చెందిన అమ్మాయిని కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. దీంతో... ఈ హత్య ఆ కారణంగానే జరిగిందా.. లేక, దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యపేట డీఎస్పీ తెలిపారు.