సంక్రాంతికి ఆ క్రేజీ మల్టీ స్టారర్

సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ పోటీ పడుతూ ఉంటారు.

Update: 2024-09-18 03:44 GMT

సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ పోటీ పడుతూ ఉంటారు. స్టార్ హీరోల చిత్రాలని ఆ సమయంలో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారు. మినిమమ్ బాగుందనే టాక్ వచ్చిన సంక్రాంతి సమయంలో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయి. సంక్రాంతి సమయంలో ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే కమర్షియల్ సక్సెస్ రేట్ సంక్రాంతి సీజన్ సినిమాలకి ఎక్కువ ఉంటుంది.

ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. జనవరి 10న ‘విశ్వంభర’ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ‘NBK109’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావితున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావొచ్చని అనుకుంటున్నారు. దీంతో పాటుగా దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో సిద్ధం అవుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ సీజన్ లోనే రానుంది.

అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సక్సెస్ లు ఉన్నాయి. వాటిలో ‘ఎఫ్2’ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటామనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి రేసులోకి టాలీవుడ్ నుంచి ఓ మల్టీ స్టారర్ మూవీ రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కాంబినేషన్ లో విజయ్ కుమార్ కనకమేడల మూవీ చేస్తున్నారు.

తమిళంలో హిట్ అయిన ‘గరుడన్’ రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుందంట. శంకర్ కూతురు అదితీ శంకర్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారంట. ఈ సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్న కూడా వారికి ఇటీవల కాలంలో సరైన హిట్స్ లేవు. కానీ మల్టీస్టారర్ కాబట్టి కాస్త కొత్తగా ఉండవచ్చు.

ఇక పొంగల్ లో ఇప్పటికే ‘విశ్వంభర’, ‘NBK109’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలతో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర నిలబడగలరా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి రేసులో వచ్చి స్టార్ హీరోల పోటీని తట్టుకొని నిలబడాలంటే కంటెంట్ తో ఏదైనా అద్భుతం చేయాలి. ఈ ఏడాది హనుమాన్ మూవీ అలాంటి అద్భుతం చేసి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. మరి రీమేక్ కథతో వస్తోన్న ఈ మల్టీ స్టారర్ మూవీ ఏ మేరకు పోటీని ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News