నాగ చైత‌న్య‌తో 100 కోట్ల బ‌డ్జెట్ సినిమా!

ఈ సినిమాకు 'వృష‌క‌ర్మ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అలాగే ఈ చిత్రాన్ని 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి స‌న్నాహాకాలు జ‌రుగుతున్నాయట‌.

Update: 2025-01-21 08:30 GMT

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టిస్తోన్న 'తండేల్' భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి.ఈ సారి డైరెక్ట‌ర్ చందు మొండేటి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా? అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు అధారంగా ఈ చిత్రాన్ని తెరెక్కించడంతో? మ‌రింత బ‌జ్ నెల‌కొంది. అన్నింటికి ఫిబ్ర‌వ‌రి 7న తెర ప‌డిపోనుంది.

ప్ర‌చారం ప‌నులు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం నాగ‌చైత‌న్య కార్తీక్ దండు ప్రాజెక్ట్ ని ప‌ట్టాలె క్కించ‌నున్నారు. 'విరూపాక్ష' త‌ర్వాత కార్తీక్ దండు చైత‌న్య సినిమా కోస‌మే నిమ‌గ్న‌మై ప‌నిచేసాడు. ఇత‌ర హీరోల‌తో అవ‌కాశాలొచ్చినా? ఆ ఛాన్స్ తీసుకోకుండా చైత‌న్య స్క్రిప్ట్ పేనే రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించాడు. ఇది కూడా ఓ థ్రిల్ల‌ర్ క‌థాశం. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇంకా చైత‌న్య‌కి హీరోయిన్ ఎవ‌రు? అన్న‌ది ఫిక్స్ అవ్వ‌లేదు. స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా? ఇంకా ఖ‌రారు కాలేదు. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రిలో ఎవ‌రో ఒక‌రికి ఆ ఛాన్స్ ద‌క్కు తుంద‌నే బ‌ల‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప్ర‌తి నాయ‌కుడిగా మాత్రం బాలీవుడ్ ని న‌టుడిని తెర‌పైకి తెస్తున్నారు. స్ప‌ర్ష్ శ్రీవాత్స‌వ ని సీన్ లోకి తెస్తున్నారు. 'బాలికా వ‌ధు' సీరియల్ తో నార్త్ లో ఫేమ‌స్ అయ్యాడు.

అటుపై 'లాప‌తా లేడీస్' లోనూ న‌టించాడు. ఈ రెండు అత‌డికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో విల‌న్ పాత్ర‌కు స్ప‌ర్ష్ శ్రీవాత్స‌వ్ ప‌ర్పెక్ట్ గా సూట‌వుతున్నాడుట‌. త్వ‌ర‌లో లుక్ టెస్ట్ నిర్వ‌హించ‌నున్నారుట‌. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడి ఛాయిస్ గా మారిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'వృష‌క‌ర్మ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. అలాగే ఈ చిత్రాన్ని 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి స‌న్నాహాకాలు జ‌రుగుతున్నాయట‌.

Tags:    

Similar News