మరో సైనికుడి కథ.. బాక్సాఫీస్ వద్ద క్లిక్కయ్యేనా?

ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలని ప్రేక్షకులు చాలా సార్లు ఆదరించారు దేశభక్తి, పోరాటం అందులో ఉంటాయి.

Update: 2024-11-19 05:40 GMT

ఇండియన్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలని ప్రేక్షకులు చాలా సార్లు ఆదరించారు. దేశభక్తి, పోరాటం అందులో ఉంటాయి. ప్రతి భారతీయుడు ఇలాంటి కథలకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. భారత సైనికులు చేసే పోరాటాలు, త్యాగాలు, విజయ గాధలు అందరికి స్పూర్తినిస్తూ ఉంటాయి. అందుకనే ఇండియన్ ఆర్మీ కథలతో వచ్చే సినిమాలు ఎక్కువగా సక్సెస్ అవుతాయి. రీసెంట్ గా తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా ‘అమరన్’ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మేజర్ ముకుందన్ వరదరాజన్ లైఫ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఏకంగా 250 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇండియన్ ఆర్మీ మేజర్ అయిన ముకుందన్ పాత్రకి శివ కార్తికేయన్ ప్రాణం పోసాడు. రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అడివి శేష్ ‘మేజర్’ మూవీ తర్వాత ఆ స్థాయిలో ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

ఇదిలా ఉంటే ఇలాంటి మరో ఇండియన్ ఆర్మీ పోరాట వీరగాధతో తెరకెక్కిన చిత్రం ‘120 బహుదూర్’. హిందీలో ఫర్హాన్ అక్తర్ హీరోగా రజ్నీష్ ఘాయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 1962లో ఇండో-చైనా వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉండబోతోంది. మేజర్ షైతాన్ సింగ్ పాత్రలో ఫర్హాన్ అక్తర్ కనిపిస్తున్నాడు. 13 కుమావోన్ రెజిమెంట్ పోరాటాన్ని ఈ మూవీ కథలో చూపించబోతున్నారు.

వారిని వీరత్వాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘అమరన్’ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రంపై కూడా పబ్లిక్ అటెన్షన్ క్రియేట్ అయ్యింది. కచ్చితంగా మంచి విజయం అందుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఫర్హార్ అక్తర్ దర్శకుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. నటుడిగా కూడా సత్తా చాటాడు. అయితే ‘భాగ్ మిల్కా సింగ్’ తర్వాత ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రని ఫర్హాన్ చేయలేదు.

‘120 బహుదూర్’ మరోసారి అతని టాలెంట్ కి తగ్గ చిత్రం అవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధం నేపథ్యంలో రియలిస్టిక్ సంఘటనలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News