అఖండ-2 నిర్మాణం.. అసలు విషయమిదే..
అయితే బాలయ్య కెరీర్ లో అఖండ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుస ప్లాఫ్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయనకు అఖండ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సీక్వెల్ అఖండ-2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చేతిలో ఉన్న డాకు మహారాజ్ మూవీ షూటింగ్ ను రీసెంట్ గా పూర్తి చేసిన బాలయ్య.. వెంటనే అఖండ సీక్వెల్ కోసం రంగంలోకి దిగిపోయినట్టు క్లియర్ గా అర్థమవుతుంది.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ-2పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య, బోయపాటి కాంబోకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. దీంతో వారిద్దరి కలయిక మరోసారి రిపీట్ అవుతుండడంతో బొమ్మ సూపర్ హిట్ అని ఇప్పటికే అంతా ఫిక్సయిపోయారు.
అయితే బాలయ్య కెరీర్ లో అఖండ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే వరుస ప్లాఫ్స్ తో ఇబ్బంది పడుతున్న ఆయనకు అఖండ మూవీ మంచి బూస్టప్ ఇచ్చింది. హిట్ ట్రాక్ లోకి ఎక్కేలా చేసింది. ఆ తర్వాత వరుస సక్సెసులతో నటసింహం దూసుకుపోతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోకుండా అదరగొడుతున్నారు.
ఇప్పుడు అఖండ సీక్వెల్ తో అలరించనున్నారు. అయితే ప్రొడక్షన్ విషయంలో ఫస్ట్ పార్ట్, సీక్వెల్ కు మధ్య చిన్న మార్పులు ఉన్న విషయం తెలిసిందే. అఖండ తొలి భాగాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు సీక్వెల్ కు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని.. ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ సంస్థ అఖండ-2ను నిర్మిస్తోంది. రవీందర్ రెడ్డినే సీక్వెల్ కూడా నిర్మిస్తారని అంచనాలు వెలువడినా.. రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే వారు బాలయ్య డేట్స్ దక్కించుకోగా.. అది కాస్త అఖండ-2 తీసేలా డీల్ జరిగింది.
ఆ విషయంలో బాలయ్య సమర్థవంతంగా పని చేశారని వినికిడి. అదే సమయంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ, తేజస్విని.. ఆర్థిక విషయాల్లో సరైన రీతిలో చర్చించుకున్న తర్వాత మిర్యాల రవీందర్ రెడ్డి నుంచి టైటిల్, కంటెంట్ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. అలా అన్ని విషయాల్లో డీల్స్ ఏ ఇబ్బంది లేకుండా జరిగేలా చేసినట్లు సమాచారం. మొత్తానికి అఖండ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.