2025 బాక్సాఫీస్ ను ఢీకొట్టబోయే క్రేజీ సినిమాలు ఇవే!

వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Update: 2024-11-30 03:24 GMT

2025లో ఇండియన్ సినిమాలో పలు క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతి సీజన్ నుంచి క్రిస్మస్ వరకూ మేజర్ రిలీజ్ స్లాట్స్ అన్నీ బుక్ అయిపోతున్నాయి. ఆల్రెడీ కొన్ని సినిమాల విడుదల తేదీలను అధికారికంగా ప్రకటిస్తే, మరికొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌' సినిమాతో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. రిపబ్లిక్ డే స్పెషల్ గా అక్షయ్ కుమార్ 'స్కై ఫోర్స్' మూవీ రానుంది. డిసెంబర్ లో రావాల్సిన విక్కీ కౌశల్ 'ఛావా' సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య తొలి పాన్ ఇండియా మూవీ 'తండేల్' కూడా అదే నెలలో వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల కాబోతోంది.

అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాని ఫిబ్రవరి మూడో వారంలో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కుదరకపోతే మే మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారని అంటున్నారు. మార్చి నెలకు సంబంధించి ఇప్పటికే పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు', విజయ్ దేవరకొండ 'VD 12' సినిమాల డేట్లు ఎనౌన్స్ చేశారు. మార్చి 28న థియేటర్లలోకి వస్తున్నాయి. అదే టైంలో 'లూసిఫర్ 2' మూవీ రానుంది.

సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సికందర్' సినిమాని ఈద్ సందర్భంగా మార్చి నెలాఖరున విడుదల చేయనున్నారు. సంక్రాంతికి రావాల్సిన చిరంజీవి 'విశ్వంభర' సినిమాని కూడా మార్చి నెలలోనే థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' మూవీ ఏప్రిల్ 10న మహావీర్ జయంతి రోజున విడుదల కానుంది. తేజ సజ్జ 'మిరాయి' మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'కన్నప్ప' సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టు మంచు విష్ణు ఇటీవలే ప్రకటించారు. ఇక మే నెలలో నాని 'హిట్ 3' మూవీ షెడ్యూల్ చేయబడింది. కమల్ హాసన్, శింబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'థగ్ లైఫ్' సినిమాని జూన్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అదే రోజున అక్షయ్ కుమార్ 'హౌస్‌ ఫుల్ 5' మూవీ రానుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 'వార్ 2' చిత్రాన్ని ఆగస్టులో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ లో టైగర్ ష్రాఫ్ 'బాఘీ 4' సినిమా రానుంది.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాంతారా' చాప్టర్-1 మూవీని అక్టోబరు 2న గాంధీ జయంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మాడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న 'థమా' సినిమా అక్టోబర్ లో దీపావళికి రిలీజ్ కానుంది. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ లో ఆలియా భట్ నటిస్తోన్న 'ఆల్ఫా' మూవీ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా పవన్ కళ్యాణ్ OG, రజనీకాంత్ 'కూలీ', సూర్య 44, అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', యశ్ 'టాక్సిక్' చిత్రాలు కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అవుతాయి.

Tags:    

Similar News