2025 సంక్రాంతికి MEGA 156.. పోటీ బరిలో ఎవరు?
ఇక హనుమ్యాన్ ని బ్లెస్ చేసిన చిరంజీవితో ప్రశాంత్ వర్మ ఎప్పటికి పని చేస్తాడు? అన్నది అభిమానుల్లో చర్చగా మారింది. ఆ ఇద్దరూ కలిసి పని చేస్తే అది మరో బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఈసారి సంక్రాంతి బరిలో మహేష్- నాగార్జున- వెంకటేష్ లతో ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా బృందం పోటీపడ్డారు. సంక్రాంతి బరిలో క్లీన్ హిట్ కొట్టింది ఈ చిన్న టీమ్. చిన్న బడ్జెట్ తో పెద్ద రేంజు సినిమా తీశారంటూ హనుమ్యాన్ బృందాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ ఘన విజయాన్ని యువహీరో తేజ సజ్జా, యువదర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా మెగాస్టార్ చిరంజీవి హనుమ్యాన్ కి బ్యాక్ ఎండ్ లో ఉండి చేసిన ప్రచారం కూడా చాలా కలిసొచ్చింది. అంతేకాదు హనుమ్యాన్ టైటిల్ ఎంపికకు స్ఫూర్తినిచ్చింది కూడా చిరునే. ఇంతకుముందు ప్రీరిలీజ్ వేదికపై హనుమ్యాన్ టీమ్ ని చిరు బ్లెస్ చేసిన సంగతి తెలిసిందే.
తేజ సజ్జాకు అంజనీ పుత్రుడైన చిరంజీవి ఆశీస్సులు దక్కాయి. ఆసక్తికరంగా 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న మెగా 156 (విశ్వంభర టైటిల్ ని పరిశీలిస్తున్నారు) విడుదల కానుంది. అయితే అప్పటికి చిరుతో పోటీపడే హీరోలు ఎవరు? అన్నది వేచి చూడాలి. మరోవైపు ప్రశాంత్ వర్మ సంక్రాంతి బరిలో అదిరిపోయే సక్సెస్ ని రుచి చూసాడు గనుక అతడు కూడా తన తదుపరి చిత్రాన్ని 2025 సంక్రాంతి రేసులో ఉండేట్టు జాగ్రత్త పడతాడని ఫిలింనగర్ వర్గాల్లో విశ్లేషణ సాగుతోంది. చిన్న హీరోతో పెద్ద హిట్టు కొట్టాడు.. పైగా పరిమిత బడ్జెట్ తో అద్భుతమైన వీ.ఎఫ్.ఎక్స్ పనితనాన్ని రాబట్టాడు గనుక తదుపరి ప్రశాంత్ వర్మకు పెద్ద హీరోతో భారీ చిత్రం ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఇక హనుమ్యాన్ ని బ్లెస్ చేసిన చిరంజీవితో ప్రశాంత్ వర్మ ఎప్పటికి పని చేస్తాడు? అన్నది అభిమానుల్లో చర్చగా మారింది. ఆ ఇద్దరూ కలిసి పని చేస్తే అది మరో బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తొలి నుంచి ప్రయోగాత్మక సినిమాలతో తన దారి ప్రత్యేకమైనది అని నిరూపిస్తున్నాడు. ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ఠకు ఫాంటసీ డ్రామాను తెరకెక్కించే అవకాశం కల్పించిన చిరు తదుపరి ప్రశాంత్ వర్మకు ఓ ఛాన్సిస్తారనే ఆశిస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహా ఫాంటసీ కథతో వశిష్ఠ చిరును ఒప్పించారు. తాను అనుకున్న స్క్రిప్టును యథాతథంగా మలిచేందుకు చిరు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పిన వశిష్ఠ 2025 సంక్రాంతికి తన సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. భారీ వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంటుంది గనుక అక్టోబర్ నాటికే పూర్తిగా టాకీని పూర్తి చేసి నిర్మాణానంతర పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తారట. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న మెగా 156 టైటిల్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరీర్ లో టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా ఇది ఉంటుందని చెబుతున్నారు. విశ్వంభర అనే టైటిల్ ని నిర్ణయించారని ఇప్పటికే లీకులు అందిన సంగతి తెలిసిందే.