సమ్మర్ 2025.. ఏ సినిమా ఎప్పుడెప్పుడు..?
మార్చి చివర నుంచి వరుస సినిమాల రిలీజ్ లు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి.
2025 సమ్మర్ సినీ లవర్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా సినిమాలు రిలీజ్ షెడ్యూల్ అవుతున్నాయి. మార్చి చివర నుంచి వరుస సినిమాల రిలీజ్ లు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాయి. ముందుగా మార్చ్ 28 న రాబిన్ హుడ్, 29న మ్యాడ్ 2 రాబోతున్నాయి.
ఇక ఏప్రిల్ లో మొదటి వారం ఏప్రిల్ 3న భైరవం రిలీజ్ లాక్ చేశారు. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్ వస్తుంది. ఏప్రిల్ 18న అనుష్క ఘాటి రిలీజ్ ఫిక్స్ చేశారు. సుందరకాండ సినిమా కూడా ఏప్రిల్ 18నే రిలీజ్ అనుకుంటున్నారు.
ఇదే క్రమంలో ఏప్రిల్ 25న కన్నప్ప రిలీజ్ లాక్ చేశారు. ఇక మే లోనే # సింగిల్ రిలీజ్ అని అనౌన్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మే లోనే రిలీజ్ అంటున్నారు. అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. ఐతే మే 1న నాని హిట్ 3 రిలీజ్ లాక్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా మే 9న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ డేట్ మిస్సైతే మాత్రం జూలైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక మే 30న విజయ్ దేవరకొండ కింగ్ డం రిలీజ్ ఫిక్స్ చేశారు.
సమ్మర్ కి ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్ అదే 2024 సమ్మర్ చాలా చప్పగా సాగింది. స్టార్ సినిమాలన్నీ సమ్మర్ ని వదిలేయగా వచ్చిన మీడియం బడ్జెట్ సినిమాలు మిస్ ఫైర్ అయ్యాయి. ఐతే ఈసారి మాత్రం ఫుల్ ప్యాక్ గా అటు స్టార్ సినిమాలతో పాటు టైర్ 2 హీరోల సినిమాలు కూడా సమ్మర్ రేసులో దిగుతున్నాయి. ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అందించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
స్టూడెంట్స్ కి హాలీడేస్ ఉండే సమ్మర్ లో అసలైతే స్టార్ సినిమాలు వస్తే రికార్డులు తిరగరాస్తాయి. ఐతే ఈ సమ్మర్ కి స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా కంటెంట్ ఉన్న సినిమాలు రేసులో పోటీ పడుతున్నాయి. స్ట్రైట్ తెలుగు సినిమాలే కాదు తమిళ హీరో సూర్య రెట్రో లాంటి సినిమాతో సమ్మర్ ఫైట్ కి వచ్చేందుకు సిద్ధమయ్యారు. సూర్య రెట్రో సినిమా మే 1న రిలీజ్ లాక్ చేశారు.
సో సమ్మర్ ని సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఈసారి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల మధ్య ఈ ఫైట్ ఎలా ఉంటుంది.. వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది అప్పుడే తెలుస్తుంది.