నగరం నడిబొడ్డున గ్రాండ్‌గా 'పుష్ప 2' ఈవెంట్.. క్రెడిట్ మొత్తం వారికే దక్కుతుందా?

హైదరాబాద్ సిటీలో ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ జరగలేదనే చెప్పాలి. ఈ క్రెడిట్ మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ 'శ్రేయాస్ మీడియా'కే దక్కుతుంది.

Update: 2024-12-03 13:47 GMT

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన "పుష్ప 2: ది రూల్" సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని, డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. గత కొన్ని రోజులుగా మేకర్స్ ప్రమోషన్స్ తో హోరెత్తించారు. దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా గురించి చర్చలు జరిగేలా చేశారు. పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి వంటి మహా నగరాల్లో సక్సెస్ ఫుల్ గా భారీ ఈవెంట్స్ చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

 

'పుష్ప వైల్డ్ ఫైర్ జాతర' పేరుతో హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో 'పుష్ప 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో ఏ సినిమా ఈవెంట్ కూడా ఈ రేంజ్ లో జరగలేదు. వేలాది మంది ఫ్యాన్స్ తరలి వచ్చినా, ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన లేకుండా భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా జరగడం వెనుక శ్రేయాస్ మీడియా వారి కృషి ఎంతో ఉందని చెప్పాలి.

 

సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ గా పేరు గాంచిన 'శ్రేయాస్ మీడియా'.. ఇప్పటికే ఎన్నో భారీ సినిమా ఫంక్షన్స్ ను నిర్వహించారు. ఇప్పుడు 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వచించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హీరో అల్లు అర్జున్ చేసే చివరి గ్రౌండ్ ఈవెంట్ ఇదే కావడంతో.. భారీగా జనం తరలి వచ్చారు. అయినా సరే ఎలాంటి లోటు పాట్లు లేకుండా, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి విజయవంతంగా ఈ ఈవెంట్ ను నిర్వచించారు. ఎన్నడూ లేని విధంగా సుమారు 1000 మంది పోలీసులు ఈ ఈవెంట్ కు బలగంగా నిలవడం జరిగింది.

 

నిజానికి 'పుష్ప-2' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి శ్రేయాస్ మీడియా వారికి 24 గంటల ముందు ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చింది. ముందుగా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్శిటీలో ఈవెంట్ చేస్తారనే టాక్ నడిచింది. కానీ హైదరాబాద్ నడిబొడ్డున పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి ఈవెంట్ కి అనుమతి వచ్చిన వెంటనే, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. సోమవారం నాటికి టీమ్ అంతా వర్క్ చేసి, ఎంట్రీ పాసులు ప్రింటింగ్ చేసి, వాటిని అభిమానులకు డిస్ట్రిబ్యూట్ చేశారు. కష్టమైన పరిస్థితుల్లో ఘనంగా ఈవెంట్ ని నిర్వహించగలిగారు.

 

మాములుగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ఏవైనా పబ్లిక్ ఈవెంట్స్ జరిగినప్పుడు.. పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు కాబట్టి, కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతుంటాయి. కానీ శ్రేయాస్ మీడియా వారు ఫ్యాన్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంతో, గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. హైదరాబాద్ సిటీలో ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్స్ జరగలేదనే చెప్పాలి. ఈ క్రెడిట్ మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ 'శ్రేయాస్ మీడియా'కే దక్కుతుంది.

 

 

ఇకపోతే 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్ తో పాటుగా దర్శకుడు సుకుమార్, హీరోయిన్లు రష్మిక మందన్న, శ్రీలీల, అనసూయ భరద్వాజ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ కూబా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తదితరులు హాజరయ్యారు. అంతేకాదు దర్శకులు ఎస్.ఎస్ రాజమౌళి, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, బుచ్చిబాబు సానా, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ హాజరై చిత్ర బృందానికి తమ బెస్ట్ విషెస్ అందజేశారు. అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేశారు.

Tags:    

Similar News