విడాకుల పుకార్లపై యువ‌హీరో స్పంద‌న‌

ఆది పినిశెట్టి పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన న‌టుడు.. తెలుగు, త‌మిళంలో పేరున్న హీరో. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే అయినా తన తండ్రి పేరు ఉపయోగించుకోకుండా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Update: 2025-02-26 06:52 GMT

హీరోగా, విల‌న్‌గా, స‌హాయ‌న‌టుడిగా ఆది పినిశెట్టి ప‌రివ‌ర్త‌న గురించి తెలిసిందే. క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే, అగ్ర‌హీరోల సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల్లోను న‌టించాడు. ఇంత‌కుముందు `రంగ‌స్థ‌లం` చిత్రంలో రామ్ చ‌రణ్ సోద‌రుడిగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. వైశాలి, గుండెల్లో గోదారి లాంటి చిత్రాల్లో క‌థానాయ‌కుడిగా మైమ‌రిపించే ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆది స‌త్తా చాటాడు.


ఆది పినిశెట్టి పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన న‌టుడు.. తెలుగు, త‌మిళంలో పేరున్న హీరో. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే అయినా తన తండ్రి పేరు ఉపయోగించుకోకుండా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు. పాత్ర‌లోకి ప‌ర‌కాయం చేయ‌డం ఎలానో ఆది పినిశెట్టి చాలా సార్లు నిరూపించాడు. అందుకే ఇప్పుడు అత‌డు న‌టించిన త‌దుప‌రి చిత్రం `శబ్దం` ఫిబ్రవరి 28న థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆది ఇటీవల పాపుల‌ర్ టీవీ చాన‌ల్ ఇంటర్వ్యూలో తన నటనా విధానం గురించి మాట్లాడారు. హీరోగా, విల‌న్ గా లేదా స‌హాయ న‌టుడిగా చేయ‌డం బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడానికి వీలు కల్పిస్తుంద‌ని, చాలా మంది నటులతో పనిచేసిన‌ప్పుడు సెట్‌లో మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంటుంద‌ని చెప్పాడు.

తన ఫ్యామిలీ లైఫ్ గురించి ఊహాగానాలను ప్రస్తావిస్తూ.. భార్య‌ నిక్కీ గల్రానీ నుండి విడిపోయారనే పుకార్లను తోసిపుచ్చారు. కొంతకాలం క్రితం విడాకులు తీసుకుంటున్నామని ఒక తప్పుడు క‌థ‌నం వ‌చ్చింది. నిరాధారమైన వార్తలను చూసి నేను షాక్ అయ్యాను. ఎటువంటి నిజం లేకుండా తప్పుదారి పట్టించే వార్త‌ల‌ను సృష్టించే వారి గురించి ఏమి చెప్పగలం? ఇలాంటి పుకార్లకు ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే మంచిది.. అని అన్నారు. గాసిప్ ల‌ను ప‌ట్టించుకోకూడ‌ద‌ని తాను భావించిన‌ట్టు తెలిపారు.

Tags:    

Similar News