ఆది పినిశెట్టి 'శబ్దం'.. రిస్కీ డిసిషన్!

టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి ఇప్పుడు శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

Update: 2025-02-22 11:08 GMT

టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి ఇప్పుడు శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు అరివళగన్‌ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో లక్ష్మీ మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పటికే అరివళగన్‌, ఆది పినిశెట్టి కాంబోలో వైశాలి మూవీ వచ్చి అందరినీ ఆకట్టుకుంది.

దీంతో ఇప్పుడు శబ్దం మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆది పినిశెట్టి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో నటిస్తున్న ఆ సినిమా.. ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రీసెంట్ గా శబ్దం మేకర్స్.. ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ నెలకొంది.

సైకలాజికల్ ఇన్‌స్టిగేటివ్ థ్రిల్లర్‌ గా మూవీ ఉండనున్నట్లు.. ఇప్పటికే క్లియర్ గా అర్థమైంది. గబ్బిలాల శబ్దంతో బాధపడుతున్న ఓ మహిళ చుట్టూ సినిమా సాగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు... ఆడియన్స్ లో సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే ఇప్పుడు శబ్దం మేకర్స్.. పాత అండ్ రిస్కీ ట్రెండ్ ను ఫాలో అయ్యారు. అదేంటంటే.. గతంలో నిర్మాతలు తమ సినిమాలను అధికారిక విడుదలకు ముందే పంపిణీదారుల కోసం ప్రదర్శించేవారన్న విషయం తెలిసిందే. దాని ఆధారంగా థియేట్రికల్ బిజినెస్ నిర్వహించేవారు. కానీ కొద్ది రోజులుగా అలా జరగడం లేదు.

ఇప్పుడు శబ్దం.. ఆ ట్రెండ్ ను రీస్టార్ట్ చేసింది. ఎందుకంటే శబ్దం థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద ఆసక్తి చూపలేదని ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో నిర్మాతలు అవుట్‌ పుట్‌ పై చాలా నమ్మకంగా ఉండటంతో ఏరియా వారీగా పంపిణీదారుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

అయితే విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ప్రదర్శించడం కాస్త రిస్కీ నిర్ణయం అయినప్పటికీ.. ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నందున నిర్మాతలు నిజంగా సాహసోపేతమైన చర్య తీసుకున్నారనే చెప్పాలి. ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో ఎన్ సినిమాస్ శబ్దం మూవీని రిలీజ్ చేస్తుండగా.. మైత్రీ డిస్ట్రిబ్యూషన్ నిజాం ప్రాంతంలో విడుదల చేస్తోంది. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News