స్టార్ డ‌మ్ గురించి ఆ స్టార్ హీరో ఏమ‌న్నారంటే!

తాజాగా స్టార్ డ‌మ్ గురించి ఓ హాలీవుడ్ రిపోర్ట‌ర్ ఇంట‌ర్వ్యూలో అమీర్ ఆసక్తిర విష‌యాలు పంచుకున్నారు.

Update: 2024-11-12 22:30 GMT

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'దంగ‌ల్' తో 2000 కోట్ల వ‌సూళ్లు సాధించి భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన ఏకైక‌ స్టార్ గా నిలిచారు. అలాగే ప్లాప్ సినిమాల తో క‌నీసం ఓపెనింగ్ లు కూడా తీసుకురాలేని ప‌రిస్థితిని సైతం చూసారు. తాజాగా స్టార్ డ‌మ్ గురించి ఓ హాలీవుడ్ రిపోర్ట‌ర్ ఇంట‌ర్వ్యూలో అమీర్ ఆసక్తిర విష‌యాలు పంచుకున్నారు.

`అసలు హీరో స్టార్‌డమ్ తో థియేట‌ర్లో ఎన్ని సీట్లు నింపుతారు? మీరు సినిమా థియేట‌ర్ ని పిల్ చేయ‌గ‌లిగితే స్టార్. నేను నిన్ను అభిమానించ వ‌చ్చ‌. కానీ మీ సినిమా చూడ‌క‌పోవ‌చ్చు. అత‌ను కూడా స్టారే. అత‌డు స్టార్ కాద‌ని నేనే చెప్ప‌డం లేదు. సీట్లు నింపలేని హీరోలు కూడా స్టార్‌లే నాదృష్టిలో. కానీ నేను నిర్మాత‌గా ఓ సినిమా చేస్తే ఆ హీరో థియేట‌ర్లో సీట్లు అన్ని నింపాల‌ని ఆశీస్తాను.

అలా కాక‌పోతే అత‌న్ని నా సినిమాకి ఎందుకు హీరోగా తీసుకుంటాను? ఒక స్టార్‌గా, నటుడిగా, నాకు నిర్దిష్ట వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అవసరం కావచ్చు. కానీ నేను సినిమా కోసం స్టార్ కోసం చూస్తాను. నేనో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తాను. అప్పుడు నాకు పెద్ద స్టార్ కావాలి. థియేట‌ర్లో సీట్లు నింపే వ్య‌క్తి కావాలి. కానీ ఓ వ్య‌క్తి జ‌నాద‌ర‌ణ పొంద‌డం అన్న‌ది ముఖ్యం కాదు. `3 ఇడియ‌ట్స్` సినిమా స‌క్సెస్ క్రెడిట్ ని నేను ఒక్క‌డినే తీసుకోలేను.

ఈ చిత్రం చేతన్ భగత్ నవల నుంచి తీసుకున్నారు. ఇందులో నాతో పాటు కొంత‌మంది న‌టులు క‌లిసి న‌టించారు. సక్సెస్ లో అంద‌రూ భాగ‌మే. ఏ న‌టుడైనా ఓపెనింగ్ ద్వారా స్టార్ ని కొంత‌వ‌రకూ నిర్వ‌చించ‌వ‌చ్చు. నేను మొద‌టి మూడు రోజుల క్రెడిట్ మాత్ర‌మే నేను తీసుకుంటాను. ఆ ప‌ద్ద‌తిలో స్టార్ డమ్ ని కొంత‌వ‌ర‌కూ కొల‌వ‌గ‌లం. ఆ త‌ర్వాత కంటెంట్ మాత్ర‌మే థియేట‌ర్ కి ప్రేక్ష‌కుల్ని తీసుకు రాగ‌ల‌దు. చాలా సినిమాలు స‌రిగ్గా లేక‌పోయినా మంచి వ్యాపారం చేసుకుంటాయి. ఆ సినిమాలో న‌టుడు సీట్లు నింప‌లేక‌పోవ్చు. అయినా ఆ సినిమా కొంత‌వ‌ర‌కూ రాబ‌డుతుంది` అని అన్నారు.

Tags:    

Similar News