మెగాస్టార్‌ని అమీర్ ఖాన్ ఎంత‌గా అభిమానిస్తారో తెలుసా?

సౌత్ ఇండ‌స్ట్రీ స్టార్ల‌తో గొప్ప స్నేహాన్ని కొన‌సాగించే హీరోల్లో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒక‌రు.

Update: 2024-10-07 17:30 GMT

సౌత్ ఇండ‌స్ట్రీ స్టార్ల‌తో గొప్ప స్నేహాన్ని కొన‌సాగించే హీరోల్లో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఒక‌రు. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అభినంద‌న కోసం అమీర్ ఖాన్ నేరుగా హైద‌రాబాద్‌కి విచ్చేసారు. మీరు ఆజ్ఞాపించండి నేను వ‌స్తాను సార్! అంటూ మెగాస్టార్ పై త‌న అభిమానం చాటుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అమీర్ త‌త్వాన్ని ఇది ప్ర‌తిబింబించింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పైనా అమీర్ ఖాన్ ఎన్నోసార్లు త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పైనా అమీర్ త‌న అభిమానాన్ని ఏనాడూ దాచుకోలేదు. త‌న సీనియ‌ర్ల‌ను గౌర‌వించ‌డంలో అమీర్ ఖాన్ వినమ్ర‌త ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. భార‌త‌దేశంలో 99శాతం స‌క్సెస్ రేటు, గొప్ప అభిరుచి ఉన్న ఒక గొప్ప స్టార్ సాటి హీరోల‌ను గౌర‌వించే తీరు, వినమ్ర‌త‌ ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో ముగ్గురు మెగాస్టార్‌లపైనా గొప్ప అభిమానం చాటుకున్నారు అమీర్ ఖాన్.

అమితాబ్ బచ్చన్ తన 82వ పుట్టినరోజు (అక్టోబర్ 11న)ను పుర‌స్క‌రించుకుని తాజాగా `కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16` స్పెష‌ల్ ఎపిసోడ్ లో త‌న‌యుడు జునైద్ తో క‌లిసి అమీర్ ఖాన్ ఎంట‌ర్ టైన్ చేసారు. దీనికి సంబంధించిన ఇటీవలి ప్రోమోలో అమీర్ ఖాన్ అత‌డి కుమారుడు జునైద్ ఖాన్‌లతో కలిసి మెగాస్టార్ ప్రత్యేక రోజును హైలైట్ చేశారు. క్లిప్‌లో అమీర్ బిగ్ బి పై తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. అమితాబ్ శాశ్వత విజయాన్ని సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ఆధిపత్యాన్ని కొనియాడాడు. అమితాబ్ ఐకానిక్ సాంగ్ `జుమ్మా చుమ్మా దే దే`కి డ్యాన్స్ చేస్తూ అమీర్ వేదిక‌కు చేరాడు. అతడు ప్రేక్షకులకు ఒక ప్రశ్న వేసాడు. ``జబ్ మే చోటా థా, ట్యాబ్ సూపర్ స్టార్ కౌన్ థా? (నేను చిన్నతనంలో సూపర్‌స్టార్‌ ఎవరు?)`` అని అమితాబ్‌ పేరుతో ప్రేక్షకులు స్పందించారు. అమీర్ కొనసాగించాడు. “అబ్ జబ్ మే బుద్ధా హో రహా హు, ట్యాబ్ సూపర్ స్టార్ కౌన్ హై? (ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు?)`` మరోసారి ప్రేక్షకులు `అమితాబ్` పేరునే చెప్పారు. టీజర్ ఆద్యంతం సరదా పరిహాసాల‌తో ఆక‌ట్టుకుంది. ఆమీర్ బిగ్ బిపై తన అభిమానాన్ని అస్స‌లు దాచుకోలేదు. అమితాబ్ బచ్చన్‌కు అమీర్ ఖాన్ తన పెద్ద అభిమానిని అని నిరూపించుకునే ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు.

KBC తాజా ప్రోమోలో అమీర్ ఖాన్ ది గ్రేట్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ఇలా అడిగాడు ``నా మ‌న‌సులో మీకు సంబంధించిన‌ ఒక ప్రశ్న ఉంది. ఆప్కో అప్నీ షాదీ కి డేట్ యాద్ హై. (మీ పెళ్లి తేదీ గుర్తుందా?) అని ప్ర‌శ్నించాడు.. దానికి స్పందిస్తూ, ``3 జూన్ 1973`.... దానికి అమీర్ సాక్ష్యం అడిగాడు. కోయి సబుత్ తో దీజియే! అని చెప్పాడు. నాకు ఒక జ్ఞాప‌కం ఉంది. అది మీ `పెళ్లి కార్డు` అంటూ అమీర్ తెలిపారు. మేనే ఆప్కో ఆప్కా నంబర్ వన్ అభిమాని హోనే కా సబుత్ దియా హై (దీనితో, నేను మీకు పెద్ద అభిమానిని అని నిరూపించుకున్నాను..) అని అన్నారు. ఎపిసోడ్ కి సంబంధించిన టీజ‌ర్ లోనే బోలెడంత వినోదం పంచారు. పూర్తి ఎపిసోడ్ ఇంకెంత ర‌క్తి క‌ట్టిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News