మహాభారతం ప్రతీ భారతీయుడు గర్వపడేలా!
బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్..టాలీవుడ్ నుంచి రాజమౌళి ఇద్దరు మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు.
మహాభారతాన్ని సినిమాగా తీయడం కోసం ఓ ఇద్దరు లెజెండ్లు కాచుకుని కూర్చున్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్..టాలీవుడ్ నుంచి రాజమౌళి ఇద్దరు మహాభారతాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఓపెన్ గా ఎవరికి వారు చెప్పారు. అలాగని ఇద్దరు కూడా తొందర పడి చేయాలనుకోవడం లేదు. మహాభారాతాన్ని తీయాలంటే ఇప్పుడున్న అనుభవం సరిపోదాని...దర్శకుడిగా ఇంకా అనుభవం సంపాదించిన తర్వాత..కథల పట్ల మరింత విశ్లేషణ పెరిగిన తర్వాత తీయాలి? అన్నది రాజమౌళి ప్లాన్.
అందుకు ఎంత సమయం పడుతుందో? కూడా తనకు తెలియదన్నారు. పైగా మహాభారతాన్ని ఒక్క భాగంలోనో... రెండు భాగాల్లోనో చెప్పేది కాదని కంటున్యూగా కొన్ని ప్రాజెక్ట్ లుగా దాన్ని తెరపైకి తీసుకురావాలన్నారు. ఇది రాజమౌళి వెర్షన్. మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా గతంలో వివిధ వేదికలపై దాదాపు ఇలాగే మాట్లాడారు. అయితే తాజాగా ఆయన నిర్మించిన `లాపత్తా లేడీస్` ఆస్కార్ కి నామినేట్ అయిన నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా మరోసారి మహా భారతం గురించి మాట్లాడారు. దీన్ని కలల ప్రాజెక్ట్ గా వర్ణించారు.
ఎంతో బాధ్యతతో పాటు భయం కూడా ఉందన్నారు. ఒకవేళ మొదలు పెడితే గనుక చిన్న తప్పు కూడా దొర్లకుండా పూర్తి చేయాలన్నారు. `ప్రతీ భారతీయుడు రక్తంలోనూ ఈ కథ ఉంది. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిం చాలనుకుంటున్నా. ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. కానీ ఇది జరుగుతుందో? లేదో తెలి యదు. కానీ కచ్చితంగా పని చేయాలనుకుంటున్నా` అని మరోసారి అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే అమీర్ ఈ ప్రాజెక్ట్ ను కేవలం నిర్మించే అవకాశం ఉంది. డైరెక్టర్ గా తాను మాత్రం ముందుకు రారు. నటు డిగా, నిర్మాతగా మహాభారంతం చేస్తారు. రాజమౌళి మాత్రం గొప్ప ఫిలిం మేకర్. దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటప్పుడు అమీర్ ఖాన్ నే తీసుకుని రాజమౌళి చేస్తే ఈ చర్చే ఉండదు. పైగా మహా భారతం ఐదుగురు ఆరుగురు నటులతో చేసే ప్రాజెక్ట్ కాదు. ఇండియాలో ఉన్న? స్టార్ హీరోలందరూ రంగంలోకి దిగాల్సిన ప్రాజెక్ట్. అలాంటప్పుడు నువ్వా? నేనా ? అనుకోవడం కంటే? ఇద్దరు కలిస్తే చర్చే ఉండదు.