అవార్డ్స్‌ వేడుక‌ల‌పై స్టార్ హీరో ఫీలింగ్

సెలెక్టివ్ పబ్లిక్ అప్పియరెన్స్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచే హిందీ అగ్రనటుడు అమీర్ ఖాన్ చివరకు `ది గ్రేట్ ఇండియన్ కపిల్` షోలో అరంగేట్రం చేశాడు

Update: 2024-04-24 15:26 GMT

సెలెక్టివ్ పబ్లిక్ అప్పియరెన్స్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచే హిందీ అగ్రనటుడు అమీర్ ఖాన్ చివరకు `ది గ్రేట్ ఇండియన్ కపిల్` షోలో అరంగేట్రం చేశాడు. ఖాన్ తో తాజా ఎపిసోడ్ టీజర్ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది. అభిమానులలోకి ఇది దూసుకెళుతోంది. టీజర్‌లో హోస్ట్ కపిల్ శర్మ, ఖాన్‌తో తన ట్రేడ్‌మార్క్ పరిహాసంతో అల‌రించాడు. అమీర్ నుండి స్పష్టమైన ప్రతిస్పందనలను రాబ‌ట్టాడు. సమయం విలువను నొక్కి చెబుతూ.. తాను అవార్డుల‌ వేడుకలను దాటవేయడం వెన‌క లాజిక్ ని అమీర్ బ‌య‌ట‌పెట్టారు.

అవార్డ్ షోలకు గైర్హాజరు కావడం గురించి ప్రశ్నించగా.. అమీర్ ఖాన్ తెలివైన స‌మాధానం ఇచ్చారు. ``సమయం విలువైనది.. దానిని తెలివిగా ఉపయోగించుకోండి`` అని సూచించారు. నిజానికి అమీర్ ఖాన్ స‌మాధానం చాలా మంది తెలివైన వారి ఎంపిక అని గుర్తించాలి. ఇటీవ‌లి కాలంలో అవార్డుల కార్య‌క్ర‌మాల‌పై సెల‌బ్రిటీల‌కు గౌర‌వం ఆస‌క్తి త‌గ్గాయి. అలాంటి వారిలో అమీర్ ఒక‌రు. కాల‌యాప‌న కోసం కాకుండా మంచి ఔట్ పుట్ కోసం ప‌ని చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తామ‌ని చాలా మంది స్టార్లు గ‌తంలో వ్యాఖ్యానించిన సంద‌ర్భాలున్నాయి. అమీర్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని స్ప‌ష్ఠంగా చెప్పార‌న్న‌మాట‌.

త‌న కెరీర్ డిజాస్ట‌ర్ సినిమాల గురించి అమీర్ ఖాన్ ఈ వేదిక‌పై మాట్లాడారు. తాను హృదయాన్ని అంకిత‌మిచ్చి క‌నెక్ట‌యి ప‌ని చేసిన రెండు సినిమాల ఫ‌లితాలు తారుమార‌వ్వడంతో తాను చాలా నిరాశ‌కు గుర‌య్యాన‌ని అందుకే గ్యాప్ వ‌చ్చింద‌ని కూడా అమీర్ ఖాన్ అంగీక‌రించారు. థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చ‌డ్డా ప‌రాజ‌యాల‌ను తాను జీర్ణించుకోలేక‌పోయాన‌ని అమీర్ అన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. నిర్మాతగా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో `లాహోర్ 1947`తో వస్తున్నాడు. దీనికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీతి జింటా, షబానా అజ్మీ, కరణ్ డియోల్, అలీ ఫజల్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సన్నీ, అమీర్ ఇంతవరకూ కలిసి పని చేయలేదు. అయితే వీరిద్దరూ గతంలో పోటీదారులుగా చాలా బాక్స్ ఆఫీస్ ఘర్షణలతో ఇండ‌స్ట్రీ చ‌ర్చ‌ల్లో నిలిచారు. చాలాసార్లు ఇద్దరూ విజేతలుగా నిలిచారు.

1990లో అమీర్ ఖాన్- దిల్ .. సన్నీ డియోల్- ఘయాల్ ఒకే రోజు విడుదలైనప్పుడు టిక్కెట్ విండో వద్ద పోటీప‌డ్డాయి. ఆ తర్వాత 1996లో `రాజా హిందుస్తానీ` వర్సెస్ `ఘటక్`.. అటుపైనా 2001లో `గదర్` వ‌ర్సెస్ `లగాన్` ఎపిసోడ్స్ ని ప్ర‌జ‌లు చూసారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఇవ‌న్నీ అద్భుత విజ‌యాల్ని న‌మోదు చేసాయి. ఇప్పుడు స‌న్నీడియోల్ ప్ర‌ధాన పాత్ర‌లో అమీర్ ఖాన్ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News