అమీర్ ఖాన్.. స్పీడ్ పెరుగుతోంది
ఇప్పుడు ఇండియన్ సినిమా అంటా పాన్ ఇండియా బాట పట్టింది. దర్శకులు భాషలతో సంబంధం లేకుండా నటీనటులని ఎంపిక చేసుకుంటున్నారు
ఇప్పుడు ఇండియన్ సినిమా అంటా పాన్ ఇండియా బాట పట్టింది. దర్శకులు భాషలతో సంబంధం లేకుండా నటీనటులని ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే ఆయా భాషలలో హీరోలు ఇతర భాషలలో విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వార్ 2 మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ బాట పట్టారు. సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్, ఇమ్రాన్ హష్మి లాంటి స్టార్స్ ఇప్పటికే సౌత్ సినిమాలలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరి దారిలోనే మరికొంతమంది కూడా పాన్ ఇండియా బ్రాండ్ ఉన్న సినిమాలలో కీలక పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పటిలా మేము బాలీవుడ్ స్టార్స్ అనే ఫీలింగ్ చూపించడం లేదు.
సల్మాన్ ఖాన్ సైతం గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న రోల్ లో కనిపించారు. వెంకటేష్ హిందీ సినిమాలో నటించాడు. ఇలా ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో ఇద్దరు దర్శకులు అమీర్ ఖాన్ కోసం సంప్రదిస్తున్నారంట. విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇందులో విలన్ పాత్ర కోసం అమీర్ ఖాన్ ని సంప్రదిస్తున్నారంట. అలాగే జయం రవి తని ఒరువన్ 2 కోసం మోహన్ రాజా కూడా అమీర్ ఖాన్ ని ప్రతినాయకుడి పాత్ర కోసం ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలలో అమీర్ ఖాన్ ఒకవేళ నటిస్తే మాత్రం కచ్చితంగా రెండింటికి ఇండియన్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మూవీ బడ్జెట్ అమాంతం పెరిగిపోతుంది.
దాంతో పాటుగా సినిమాల మార్కెట్ కూడా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం ఈ కథలని అమీర్ ఖాన్ కి నేరేట్ చేయాలని దర్శకులు అనుకుంటున్నారంట. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమీర్ ఖాన్ రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో తన కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా సొంత ప్రొడక్షన్ లోనే తెరకెక్కనుంది.