ఆయ్… ఆదివారం కలెక్షన్స్ అదిరాయ్

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఎంటర్టైన్ మెంట్ మూవీ ఆయ్

Update: 2024-08-19 10:00 GMT

ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఎంటర్టైన్ మెంట్ మూవీ ఆయ్. అంజిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు తక్కువ కలెక్షన్స్ అందుకున్న కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మౌత్ టాక్ జనాల్లోకి బలంగా వెళ్ళింది.

చాలా రోజుల తర్వాత మరల ఫుల్ కామెడీ ఎంటర్టైర్మెంట్ తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన చిత్రంగా ఆయ్ మూవీ ఉందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి కూడా వినిపించింది. ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూ లతోపాటు, పబ్లిక్ నుంచి కూడా బాగుందని టాక్ జనాల్లోకి వెళ్ళడంతో వీకెండ్ లో ఈ మూవీకి ప్రేక్షకాదరణ పెరిగింది. ఈ ఇంపాక్ట్ స్పష్టంగా సినిమా కలెక్షన్స్ లో కూడా కనిపించడం విశేషం.

మొదటి రోజు ఆయ్ మూవీ ఓవరాల్ గా 62 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. మొదటి రోజుతో పోల్చుకుంటే నాలుగవ రోజైన ఆదివారం 300% కలెక్షన్స్ పెరుగుదల కనిపించడం విశేషం. దీంతో ఆదివారం ఈ చిత్రానికి 2.2 కోట్ల గ్రాస్ వచ్చింది. దీనిని బట్టి సినిమాకి పబ్లిక్ నుంచి ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం రాఖీ పౌర్ణమి ఫెస్టివల్ కూడా కలిసి రావడంతో కచ్చితంగా ఆయ్ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ కి సోలోగా ఆయ్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ లభించింది అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. సినిమాకి వస్తోన్న ఆదరణ ఇదే స్థాయిలో కొనసాగితే కచ్చితంగా నిర్మాత బన్నీ వాస్ కి ఈ మూవీ భారీ లాభాలను తెచ్చిపెడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే హీరోగా నార్నె నితిన్ కెరియర్ కి ఈ చిత్రం మంచి బూస్టింగ్ అవుతుందని భావిస్తున్నారు.

ఆయ్ మూవీకి కలెక్షన్స్ పరంగా మొదటి రోజు నుంచి నాలుగో రోజు ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో సినిమా ఇన్ క్రీజ్ అయిందనేది చెబుతూ చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో ఆయ్ సినిమాకి 300 శాతం కలెక్షన్స్ ఇన్ క్రీజ్ ఉందని పోస్టర్ లో పేర్కొన్నారు. ఆయ్ కి పోటీగా రిలీజ్ అయిన డబ్బులు ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు కలెక్షన్స్ పరంగా ఇప్పటికే తేలిపోయాయి. వీకెండ్ కూడా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఇండిపెండెన్స్ డే టాలీవుడ్ విన్నర్ గా ఆయ్ మూవీ నిలిచిందని సినీవిశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News