బాలీవుడ్ లో అత‌డిపైనా ఆశ‌ప‌డ్డారా? !

కాస్టింగ్ కౌచ్ అంటే హీరోయిన్లే గుర్తొస్తారు. ఎక్కువ‌గా కాస్టింగ్ కౌచింగ్ ఎదుర్కునేది వాళ్లే. బాలీవుడ్ నుంచి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వాళ్లే హైలైట్ అవుతుంటారు.

Update: 2024-10-06 03:00 GMT

కాస్టింగ్ కౌచ్ అంటే హీరోయిన్లే గుర్తొస్తారు. ఎక్కువ‌గా కాస్టింగ్ కౌచింగ్ ఎదుర్కునేది వాళ్లే. బాలీవుడ్ నుంచి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ వాళ్లే హైలైట్ అవుతుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ అంశం తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఎక్కువ‌గా ఈ అంశంపై స్పందిస్తుంటారు. మ‌రి కాస్టింగ్ కౌచింగ్ అంటే కేవ‌లం మ‌హిళా న‌టుల‌కేనా? మేల్ న‌టుల‌కు ఉండదా? అంటే అలాంటి బాధితులు కూడా ఉన్నార‌ని అప్పుడ ప్పుడు వెలుగులోకి వ‌స్తోంది.

బాలీవుడ్ లో మ‌హిళా మ‌ణులంతా అప్ప‌ట్లో త‌ల‌పెట్టిన `మీటూ ఉద్య‌మం` దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బాధిత పురుషులు ఉన్నారంటూ కొంతమంది మీడియా ముందుకొచ్చారు. అమాయ‌క పురుషులు చాలా మంది ఉన్నార‌ని కొంద‌రు ఆరోప‌ణ‌లకు మ‌ద్ద‌తుగా నిలిచారు. తాజాగా `ముంజ్యూ` సినిమాతో ఫేమ‌స్ అయిన అభ‌య్ వ‌ర్మ కూడా ఇండ‌స్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్న‌ట్లు తెలిపాడు.

`కెరీర్ ఆరంభంలో అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోన్న స‌మ‌యంలో జ‌రిగిందీ ఘ‌టన ముంబై నుంచి పిలుపు రాగానే సినిమా అవ‌కాశమ‌ని ఎగిరి గంతేశాను. కానీ ఆఫీస్ కి వెళ్లాక అక్క‌డ అంతా ఇంకేదో మాట్లాడారు. అలా ఉంటుంద‌ని అస్స‌లు ఊహించ‌లేదు. కొంత‌సేపు ఏం జ‌రుగుతుందో అర్దం కాలేదు. నా ప్ర‌తిభ‌ను చూసి పిలిచారు అనుకున్నాను. కారు వారు నా నుంచి ఇంకేదో ఆశించారు.

నా విలువ‌ను దిగ‌జార్చుకోలేను అని చెప్పాను. తొలి మీటింగ్ లోనే అలాంటి అనుభ‌వం ఎదుర‌వ్వ‌డంతో నిరాశ చెంది పానిప‌ట్ట‌కు తిరిగి వచ్చేసాను. కానీ న‌టుడు అవ్వాలి అనే ఆశ చావ‌లేదు. నాలో నేను ధైర్యం తెచ్చుకుని ఎవ‌రి కోస‌మో నా క‌ల‌ను చంపుకోవ‌డం దేనికి అనిపించింది. అలా ముంబైలో అడుగు పెట్టి ఆడిష‌న్లు ఇవ్వ‌డం ప్రారంభించాను` అన్నాడు.

Tags:    

Similar News