భార్యతో ఎలా ఉండాలో స్టార్ హీరో స‌లహా!

ఆరాధ్య పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు బ‌చ్చ‌న్ ఫ్యామిలీ స్కిప్ కొట్ట‌డం అగ్నికి ఆజ్యం పోసింది.

Update: 2024-12-02 16:28 GMT

ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడిపోతున్నార‌ని ఇప్ప‌టికే ముంబై మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అనంత్ అంబానీ- రాధిక మ‌ర్చంట్ పెళ్లిలో అభిషేక్, ఐశ్వ‌ర్యారాయ్ విడివిడిగా క‌నిపించడంతో ఈ పుకార్ మొద‌లైంది. వారు విడివిడిగా వ‌చ్చి అక్క‌డ క‌లుసుకున్నారు. ఆరాధ్య పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు బ‌చ్చ‌న్ ఫ్యామిలీ స్కిప్ కొట్ట‌డం అగ్నికి ఆజ్యం పోసింది.

తాజాగా ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్ 2024 వేడుక‌లో క‌నిపించిన అభిషేక్ భార్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అభిషేక్ హోస్ట్ అడిగిన‌ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. పెళ్ల‌యిన మ‌గ‌వారికి ఒక సూచ‌న చేసారు. పెళ్లయిన మగవాళ్ళంతా మీ భార్య చెప్పినట్లు చేయండి'' అని ఛ‌మత్కరించాడు. ఐశ్వర్యరాయ్‌తో విడాకుల పుకార్ల న‌డుమ‌ ఈ ప్రకటన అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగించింది.

ఇటీవ‌ల వ‌రుస‌గా చ‌క్క‌ని న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న అభిషేక్ కి త‌న న‌ట‌వైదుష్యంపైనా ప్ర‌శ్న ఎదురైంది. వ‌రుస‌గా ప్ర‌శంస‌లు పొందే న‌ట‌న ఎలా సాధ్య‌మైంది? అని హోస్ట్ ప్ర‌శ్నించ‌గా..దానికి అత‌డు స‌మాధాన‌మిస్తూ.. ''దర్శకుడు ఏం చెబితే అది చేస్తాం. నిశ్శబ్దంగా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ల‌డ‌మే! అని అన్నారు. అయితే దీనికి ప్ర‌తిస్పందించిన హోస్ట్.. ''నేను ఇంట్లో ఇదే ఫార్ములా అనుస‌రిస్తాను.. మా ఆవిడ చెప్పిన‌ట్టే వింటాను'' అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. దానికి కొన‌సాగింపుగా అభిషేక్ వ్యాఖ్యానిస్తూ...''అవును నిజ‌మే.. పెళ్ల‌యిన మ‌గాళ్లంతా భార్య మాట వినాలి'' అని అన్నారు. వారి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ ఇప్పుడు నెటిజ‌నుల‌ను ఆక‌ర్షించింది. ఐష్ తో అభిషేక్ విడాకుల పుకార్ల న‌డుమ ఇప్పుడు ఈ వ్యాఖ్య గురించి చ‌ర్చ సాగుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ఇటీవలే షూజిత్ సిర్కార్ 'ఐ వాంట్ టు టాక్‌'లో న‌టించాడు. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇవ్వలేకపోయినప్పటికీ, అభిషేక్ నటన విమర్శకులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిషేక్ తదుపరి చిత్రం 'బీ హ్యాపీ'లో కనిపిస్తాడు. షారుఖ్ ఖాన్-కింగ్ .. అక్షయ్ కుమార్- హౌస్‌ఫుల్ 5 సెట్స్ పై ఉన్నాయి.

Tags:    

Similar News