పెళ్లి ఉంగరం మిస్సింగ్.. అభి-ఐష్ జంటపై మళ్లీ డౌట్లు!
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ జంట విడాకుల గురించి చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి.
అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ జంట విడాకుల గురించి చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ జంట కలిసే కనిపిస్తున్నా విడిపోయారన్న పుకార్లు షికార్ చేయడం, వాటిని ఇరువైపులా ఖండించకపోవడం .. దాని నుంచి మరిన్ని ఊహాగానాలు పుట్టుకురావడం.. ఇవన్నీ నిత్యకృత్యాలుగా మారాయి.
రెడ్డిటర్ల దుష్ట కన్ను ప్రతిసారీ ఏ జంట ఎలా విడిపోతోందో వెతుకుతోంది. లాజిక్కులు వెతుకుతూ జంటల్ని విడదీసే వార్తల్ని ప్రచురించడం ఒక ఆటగా మారింది. ఇంతకుముందు ప్రేమికులు విడిపోతే సంబరాలు చేసుకున్న రెడ్డిటర్లు ఇప్పుడు పెళ్లయిన జంటలు విడిపోయినా `పండగ` చేసుకుంటున్నారు! ఆ వార్తల్ని వెంట వెంటనే వైరల్ చేస్తూ సెన్సేషన్స్ కి తెర తీస్తున్నారు.
ఇప్పుడు అదే రెడ్డిటర్లు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యారాయ్ విడాకుల గురించి నిరంతరం ఏదో ఒక వార్తను షేర్ చేస్తుంటే అది అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఒక అందమైన కుమార్తె (ఆరాధ్య) వారికి ఉంది. ఎదిగొచ్చిన కూతురు ముందు ఆ ఇద్దరూ విడిపోతున్నారా? అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కానీ ఇప్పుడు రెడ్డిటర్లు మరో కొత్త వార్తను ఎత్తుకొచ్చారు. ఈసారి అభిషేక్ బచ్చన్ వివాహ ఉంగరం కనిపించలేదంటూ ప్రచారం మొదలు పెట్టారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పెళ్లయిన నాటి నుంచి ప్రేమకు చిహ్నంగా అభిషేక్ తన వివాహ బ్యాండ్ (ఉంగరం వగైరా)ను స్థిరంగా ధరించడం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ వెడ్డింగ్ రింగ్ కనిపించడం లేదన్నది రెడ్డిటర్ల ఆరోపణ. ఈ ఆకస్మిక మార్పు ఈ జంట వైవాహిక స్థితిని ప్రతిబింబిస్తోందని ప్రబలమైన ఊహాగానాలకు దారితీసింది. 2007 లో ఈ జంట వివాహం అయింది. అప్పటి నుంచి లేనిది ఇప్పుడు సడెన్ గా ఈ మార్పునకు కారణమేమిటీ? అంటూ ఆరాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై విపరీతమైన చర్చ సాగుతోంది.
అభిషేక్ మిస్సింగ్ రింగ్, ఇటీవల ఐశ్వర్యారాయ్ నుంచి దూరంగా కనిపించడం, ఐసూ కేవలం ఆరాధ్యతో మాత్రమే ఈవెంట్లలో కనిపించడం.. వగైరా ఇలాంటి సందేహాలకు కారణమవుతున్నాయి. కొంతమంది అభిమానులు రింగ్ లేకపోవడం బ్రేకప్‌ను సూచిస్తోందని అంటున్నారు. పరిశ్రమలో బ్రేకప్ అయిన ఇతర సెలబ్రిటీ జంటల మాదిరే ఈ జంటకు అవుతోంది. ఈ జంట కూడా విడిపోయారు! అన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవలి ఈవెంట్‌లలో అభిషేక్ రెండు మణికట్లకు గడియారాలు ధరించి కనిపించడంతో అతని ఫ్యాషన్ ఎంపికల గురించి నెటిజన్లలో ముసిముసి నవ్వులు కనిపించాయి. దీనిపై బోలెడంత చర్చ సాగింది. అయితే రెడ్డిటర్ల చర్చకు అనుకూలంగా ఐష్ కానీ, అభి కానీ స్పందించడం లేదు. ఇవేవీ పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు ఉన్నారు.
ప్రస్తుతానికి అభిషేక్ పెళ్లి ఉంగరం ఏమైనట్టు? అంటూ నెటిజనుల్లో చర్చ సాగుతోంది. పబ్లిక్ ఫిగర్స్ కి ఇలాంటివి నిజంగా పెద్ద తలనొప్పిని తెచ్చేవే. ఇది వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడమే. అనవసరమైన పరిశీలన ఇతరులకు అవసరమా? అనిపించక మానదు. ఇలాంటి ఊహాగానాలు తరచుగా అపార్థాలకు దారితీస్తాయనేది గుర్తించాలి. అభిమానులు, పరిశీలకులు తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం తగదు. బచ్చన్ కుటుంబం నుండి క్లారిటీ వచ్చే వరకు, వారి వ్యక్తిగత జీవితాలను సంచలనం చేయడం సరికాదు. ప్రస్తుతానికి వారి వృత్తిగత జీవితాలపైనే అభిమానులు దృష్టి సారిస్తే మంచిదేమో! కానీ ఇప్పటికే బచ్చన్ కుటుంబానికి జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందని కూడా అర్థమవుతోంది.