గోవా తీరంలో యాక్షన్..ఇది వేరే లెవల్ కొట్లాట!
సముద్ర గర్భంలో టైగర విన్యాసాలు థియేటర్లో ప్రేక్షకుల్ని కొత్త అనుభూతిని పంచుతాయని యూనిట్ ధీమా వ్యక్తంచేస్తుంది.
ఎన్టీఆర్ 30వ చిత్రం `దేవర`పై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో టైగర్ ఎలాంటి మాస్ పాత్రలో మెప్పించబోతున్నాడో? ఓ క్లారిటీ వచ్చేసింది. అందుకు తగ్గట్టు ..అభిమానుల అంచనాలు ఏమాత్రం తగ్గకుండా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చిత్రాన్ని చెక్కుతు న్నాడు. ఇప్పటికే అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తుంది.
సముద్ర గర్భంలో టైగర విన్యాసాలు థియేటర్లో ప్రేక్షకుల్ని కొత్త అనుభూతిని పంచుతాయని యూనిట్ ధీమా వ్యక్తంచేస్తుంది. దాని ప్రత్యేకంగా కోట్ల రూపాయల భారీ సెట్ వేసి మరీ చిత్రీకరించారు. ఇంతవరకూ షూటింగ్ అంతా దాదాపు హైదరాబాద్ సెట్స్ లోనే జరగబోతుంది. ఇక తదుపరి పరి షెడ్యూల్ రియల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం ఏకంగా గోవా తీరంలోనే ప్లాన్ చేసింది. మరి అక్కడ ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. తీరం నేపథ్యంగల కొన్ని సన్నివేశాలు సెట్స్ లో కొన్ని చేసారు.
మరిప్పుప్పుడ ప్రత్యేకంగా గోవా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే చాలా కథే ఉందని తెలుస్తోంది. గోవా బీచ్ అందాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు లీకులందుతున్నాయి. ఎన్టీఆర్...ఇతర నటీనటులు..ఫైటర్లపై ఈ మాస్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. ఈసన్నివేశాలు చాలా మాసివ్ గా ఉంటాయట. అందుకోసం భారీగా ఆయుధాలు కూడా వినియోగించనున్నారుట.
కత్తులు..గొడ్డళ్లు..సమ్మెట వంటి భారీ ఆయుధాలు ఆ యాక్షన్ సన్నివేశాలు కనిపించనున్నాయట. ఈ ఫైట్స్ ని టాలీవుడ్ మాస్టర్లతో పాటు విదేశీ స్టంట్ మాస్టర్లు కలిసి కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. మరి తీర నేపథ్యం గల సన్నివేశాలకు ఏపీ తీరం సరిపోదా? అంటే బీచ్ సహా రిసార్స్ట్ ని బేస్ చేసుకుని తెరకెక్కించాల్సిన సన్నివేశాలు ఉండటంతోనే అక్కడ ప్లాన్ చేసినట్లు చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది. అలాగే గోవాలోబీచ్ లో ఉండే విదేశీ బృందాల్ని కూడా చిత్రంలో భాగం చేస్తున్నారుట.