కరణ్‌జోహార్‌కు ఇవేం తలనొప్పులు?
ఇంతలోనే జిగ్రా మరో వివాదంలో చిక్కుకుంది. మణిపూర్- ఇంఫాల్‌కు చెందిన నటుడు బిజౌ థాంగ్‌జామ్.. చిత్ర పరిశ్రమలో తాను అనుభవించిన వివక్ష గురించి చర్చించి X లో పోస్ట్‌ను షేర్ చేయడం కరణ్ కి తలనొప్పిగా మారింది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కి ఊహించని తలనొప్పులు వచ్చి పడుతున్నాయ్. ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ లో మెజారిటీ షేర్ ని సారేగామ సంస్థకు విక్రయిస్తున్నారని ప్రచారమైంది. సినిమా రిలీజైన మొదటి రోజే రివ్యూలు రాసి చాలా వరకూ కరణ్ సినిమాలకు డ్యామేజ్ ని కలిగించడం కూడా ఒక కారణమని మాట్లాడుకున్నారు. సమీక్షకులపై అతడు కోపంతో ఉన్నాడని కూడా ప్రచారం ఉంది. అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ లో , ఓటీటీ రైట్స్ లోను ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఓటీటీ దిగ్గజాలు బాగా క్రేజ్ ఉన్న సినిమాలను మాత్రమే కొనుక్కుంటున్నాయి. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాలను ఇవ్వడంలో కరణ్ సహా బాలీవుడ్ దిగ్గజాలే బోల్తా కొడుతున్నారు.
అదంతా అటుంచితే కరణ్ ఎంతో ప్రేమించి, చెప్పుకోదగ్గ బడ్జెట్ తో నిర్మించిన జిగ్రా ధర్మ ప్రొడక్షన్స్ లో మరో బాక్సాఫీస్ ఫ్లాప్ గా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని సమాచారం. అలియా భట్, వేదాంత్ రైనా జంటగా ఇటీవల విడుదలైన జిగ్రా చిత్రం వారాంతంలో బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఇది కేవలం 16కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే నష్టాలు పెద్ద మొత్తంలోనే ఉండనున్నాయి.
ఇంతలోనే జిగ్రా మరో వివాదంలో చిక్కుకుంది. మణిపూర్- ఇంఫాల్‌కు చెందిన నటుడు బిజౌ థాంగ్‌జామ్.. చిత్ర పరిశ్రమలో తాను అనుభవించిన వివక్ష గురించి చర్చించి X లో పోస్ట్‌ను షేర్ చేయడం కరణ్ కి తలనొప్పిగా మారింది. తనను ఆడిషన్ లో ఎంపిక చేసుకుని కూడా సినిమాలో నటించే అవకాశం కల్పించలేదని, నేను జాత్యహంకార, వివక్షతతో కూడిన వ్యాఖ్యలను ఎదుర్కొన్నాను.. అని వాపోయాడు. ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో అవకాశం రావడంతో అతడు తన ఇతర ప్రాజెక్ట్‌ను కూడా పాజ్ చేశాడు. ఈ సంఘటన మొత్తం చాలా వృత్తిపరమైనది కాదు. మణిపురి నటుడికి మొత్తం నిరాశకు దారితీసింది. అయితే అతడి వ్యాఖ్యలకు ఆలియా అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.
బిజౌ థాంగ్‌జామ్ బహు ముఖ ప్రజ్ఞావంతుడు. కేవలం నటుడిగానే కాకుండా చెఫ్‌గా, గీత రచయితగా, ఆర్ట్ డైరెక్టర్‌గా , వ్యవస్థాపకుడిగా కూడా పేరు పొందారు. అతడు 2011లో మాస్టర్‌చెఫ్ ఇండియాలో అగ్రశ్రేణి 50 మంది పోటీదారులలో ఒకరిగా కీర్తిని పొందాడు. మేరీ కోమ్, శివాయ్ సహా పలు చిత్రాలలో కనిపించాడు. అతడి తాజా చిత్రం చిల్లీ చికెన్, కన్నడ-భాషా ప్రాజెక్ట్. చైనీస్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఐదుగురు ఈశాన్య కుర్రాళ్ల కథతో రూపొందింది. వారిలో ఒకరు రహస్యంగా మరణించినప్పుడు వారి జీవితాలు విషాదకరమైన మలుపు తిరుగుతాయి. ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.