సీనియర్ ఆర్టిస్టుల రేంజ్ లో బుల్లిరాజు రెమ్యునరేషన్?
ఒక్క హిట్ పడితే చాలు, సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది.;
ఒక్క హిట్ పడితే చాలు, సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ముఖ్యంగా కొత్త నటీనటులు, ప్రత్యేకించి చిన్న పిల్లల పాత్రలు పోషించిన వారైతే, మరింతగా ప్రత్యేకతను అందుకుంటారు. తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేష్ కుమారుడిగా కనిపించిన బుల్లి రాజు, తన అద్భుతమైన నటనతో అందరి మనసును దోచుకున్నాడు. సినిమా విడుదలైన రోజునుంచే అతడి నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
చిన్న పిల్లవాడు అయినా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' ఊహించని విజయాన్ని అందుకుంది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, తెలుగు చిత్రపరిశ్రమలో రీజినల్ సినిమాల్లో ఒక బిగ్ హిట్ గా నిలిచింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కుటుంబ కథా చిత్రంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో హైలైట్ ఎలిమెంట్ ఏమిటంటే, వెంకటేష్ కొడుకు పాత్రలో కనిపించిన చిన్న పిల్లవాడి క్యారెక్టర్. అతని యాక్టింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు అటు సినిమా విజయం, ఇటు తన నటన వల్ల బుల్లి రాజు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.
టాలెంట్ కారణంగా, రెమ్యూనరేషన్ ఒక్కసారిగా ఎక్స్‌పెక్టేషన్స్‌కు మించి పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బుల్లి రాజు ఒక రోజుకు ఏకంగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇది చిన్న నటులకు సైతం ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా చిన్న పిల్లల నటులకు ఇంత భారీ పారితోషికం ఇచ్చే ట్రెండ్ లేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చిన గుర్తింపు వల్ల, బుల్లి రాజు ఇప్పుడు టాప్ కమేడియన్ల లెవెల్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు.
ఇప్పటికే వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో 15 ప్రాజెక్టులు అతనికి ఆఫర్ అయినా, అతను ఎంచుకుంటూ, తక్కువ ప్రాజెక్టులనే కమిట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక పది రోజుల కాల్షీట్స్ ఇచ్చినా కూడా 10 లక్షలు. ఇక నేటితరం సీనియర్ ఆర్టిస్టులు కొందరు ఇదే రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే బుల్లి రాజును దూసుకెళ్లేలా చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు మరోసారి అతనికి ప్రత్యేకమైన అవకాశం కల్పించినట్లు టాక్.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో, బుల్లి రాజు కోసం ఓ ప్రత్యేకమైన పాత్రను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో అంజలి, మృణాల్ ఠాకూర్ లాంటి ప్రముఖ నాయికలు కీలక పాత్రల కోసం తీసుకున్నట్లు టాక్. ఇక బుల్లి రాజు పాత్ర మరింత హైలైట్ కానుందని తెలుస్తోంది. అయితే చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. జూన్ లేదా జూలైలో షూటింగ్ మొదలై, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.