సత్యదేవ్ కి మెగా అభయం.. ఒలింపిక్స్ ని పోల్చి మరీ..!

అంతేకాదు ఒలింపిక్స్ కోసం క్రీడాకారులు 5 ఏళ్లు కష్టపడతారు. అలా ట్రైన్ అయ్యాక వాళ్లు గెలవకపోతే మళ్లీ ఐదేళ్ల కోసం ఎదురుచూస్తారు.

Update: 2024-11-20 10:14 GMT

మెగాస్టార్ చిరంజీవిని చూసి ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. తన ఫ్యాన్ అయినా కాకపోయినా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి తన సపోర్ట్ అందిస్తారు చిరంజీవి. ఇక తన అభిమాని అని తెలిశాక వారికి మరింత ధైర్యాన్ని ఇస్తారు. ఈ క్రమంలోనే యువ హీరో సత్యదేవ్ కి చిరంజీవి చెప్పిన ఒక మాటను రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సత్యదేవ్.

నటుడిగా ముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత సోలో సినిమాలు చేసేలా ప్రమోట్ అయ్యాడు. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనకు మెగాస్టార్ చిరంజీవిని మొదట కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తాను చిరు సినిమాలను చూసి ఆయనలా ఫీట్లు చేసే వాడినని చెప్పిన సత్యదేవ్.

పరిశ్రమకు వచ్చాక ఫస్ట్ టైం చిరుని కలిసినప్పుడు చిరంజీవి గారు నా ఫోన్ తీసుకుని ఆయన నంబర్ ఇచ్చి అన్నయ్య అని సేవ్ చేసుకుంటావా అని అడిగారు. అంతేకాదు నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఒక కాల్ చెయ్ అని అన్నారని చెప్పాడు సత్యదేవ్. అంతేకాదు ఒలింపిక్స్ కోసం క్రీడాకారులు 5 ఏళ్లు కష్టపడతారు. అలా ట్రైన్ అయ్యాక వాళ్లు గెలవకపోతే మళ్లీ ఐదేళ్ల కోసం ఎదురుచూస్తారు. అలానే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కష్టపడుతూనే ఉండాలని తనకు చెప్పినట్టు సత్యదేవ్ చెప్పారు.

సత్యదేవ్ లాంటి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయన్ను అందరివాడు అంటారు. ఇక తన ఫ్యాన్ అని తెలిస్తే మాత్రం వారికి కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు చిరంజీవి. సత్యదేవ్ మీద ఉన్న ప్రేమ వల్లే జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చి సత్యదేవ్ ని ప్రోత్సహించారు. జీబ్రా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సినిమా కోసం సత్యదేవ్ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.

జీబ్రా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లోఅ ఆసక్తి కలిగేలా చేశాయి. ఐతే పోటీగా వేరే సినిమాలు కూడా ఉన్న ఈ టైం లో సత్యదేవ్ కి సక్సెస్ వస్తుందా లేదా అన్నది చూడాలి. జీబ్రాకు పోటీగా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ గట్టి పోటీ ఇవ్వనుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News