లేట్ అయినా లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్..!

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ మార్క్ పొలిటికల్ అండ్ సోషల్ మెసేజ్ తో ఈ సినిమా వస్తుంది.

Update: 2024-12-15 23:30 GMT

గ్లోబల్ స్టార్ రాం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. శంకర్ మార్క్ పొలిటికల్ అండ్ సోషల్ మెసేజ్ తో ఈ సినిమా వస్తుంది. 2021 లో మొదలైన ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా మధ్యలో శంకర్ ఇండియన్ 2 సినిమా పూర్తి చేయాల్సి రావడం వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ వస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతీదీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని అంటున్నారు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన శ్రీకాంత్.

చరణ్ తో ఆల్రెడీ గోవిందుడు అందరివాడేలే సినిమా చేసిన ఆయన మళ్లీ గేమ్ ఛేంజర్ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా అనుకున్న టైం లో పూర్తి చేయకపోవడానికి కారణం ఆయన వివరించారు. సినిమాలో నటించిన వారంతా సెలబ్రిటీలే వారు ఒక షెడ్యూల్ మిస్సైతే మరో షెడ్యూల్ ఇవ్వడానికి చాలా టైం పట్టేది. అలా వారందరి డేట్స్ చూసుకుని సినిమా చేయడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమా దీని వల్లే జరిగిందని చెప్పుకొచ్చారు.

సినిమాలో తాను చేస్తున్న రోల్ స్పెషల్ గా ఉంటుందని అన్నారు శ్రీకాంత్. అంతేకాదు చరణ్ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపిస్తాడని గట్టిగా చెబుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ మాక్ కమర్షియల్ సినిమాగా వస్తుందని థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారని అన్నారు శ్రీకాంత్. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఆర్.ఆర్.ఆర్ తో బంపర్ హిట్ అందుకున్న చరణ్. ఆచర్య తో నిరాశపరిచాడు. అందుకే గేమ్ ఛేంజర్ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ గురి పెట్టాడు చరణ్. ఈ సినిమాలో చరణ్ తో బాలీవుడ్ అందాల భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్ గా నిలుస్తుంది. మరి సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్తిస్తుందో చూడాలి. ఆమధ్య వచ్చిన టీజర్, రిలీజైన సాంగ్స్ ఇవన్నీ కూడా గేం ఛేంజర్ మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి. సినిమా అంచనాలకు తగినట్టుగా ఉంటే మాత్రం చరణ్ బాక్సాఫీస్ రాంపేజ్ చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News